David Warner: దిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు భారీ జరిమానా పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వహకులు జరిమాన విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను.. వార్నర్ కు రూ. 12 లక్షల రూపాయల జరిమాన విధించారు.
భారీ జరిమానా.. (David Warner)
దిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు భారీ జరిమానా పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వహకులు జరిమాన విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను.. వార్నర్ కు రూ. 12 లక్షల రూపాయల జరిమాన విధించారు.
ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో దిల్లీ హైదరాబాద్ పై 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
గెలుపు జోష్ లో ఉన్న దిల్లీకి.. షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్.. వార్నర్ కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.
ఈ సీజన్లో దిల్లీకి ఇదే తొలి తప్పిదం కాబట్టి.. జరిమానా మాత్రమే విధించారు. ఇదే తప్పు మరోసారి జరిగితే.. దిల్లీ జట్టు కెప్టెన్ పై ఒక్క మ్యాచ్ నిషేధం పడుతుంది.
ఈ సీజన్ లో ఇప్పటిదాకా జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్లు ఉన్నారు. అందులో ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ), సంజూ శాంసన్ (రాజస్తాన్ ), సూర్యకుమార్ యాదవ్ (ముంబై), హార్ధిక్ పాండ్యా (గుజరాత్), కెఎల్ రాహుల్ (లక్నో) విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) ఉన్నారు.
ఇప్పటి వరకు 7 మ్యాచులాడిన దిల్లీ రెండు మ్యాచులు మాత్రమే గెలిచి.. మిగతా ఐదింటిలో ఓడింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచుల్లో ఐదింట్లో ఓడి రెండు గెలిచింది.
ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో ఢిల్లీ నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక నిర్ణీత ఓవర్లలో సన్ రైజర్స్ 137 పరుగులు మాత్రమే చేసింది.
సన్ రైజర్స్‌లోని టాప్ ప్లేయర్స్ అంతా చేతులెత్తేసిన మయంక అగర్వాల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు.
టార్గెట్ చిన్నదే అయినా సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ అంతా స్కోర్ చేయడం కంటే ఎక్కువగా పెవిలియన్ బాట పట్టడానికే ఎక్కువ మక్కువ చూపినట్లు కనబడుతుంది.
కాగా ఈ సీజన్ లో ఉప్పల్ వేదికగా జరిగిన ఇది 4వ మ్యాచ్ కావడం విశేషం.
హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ లో ఆడిన 4 మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.