DC vs CSK: దిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 86 పరుగుల వద్ద ఔటయ్యాడు.
చెన్నై ధాటిగా ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు గైక్వాడ్, కాన్వై విజృంభించి ఆడటంతో చెన్నై 200 పైచిలుకు స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి.. 223 పరుగులు చేసింది. కాన్వై 87 పరుగులు.. గైక్వాడ్ 79 పరుగులతో చెలరేగిపోయారు. చివర్లో దూబే, జడేజా సిక్సర్ల వర్షం కురిపించారు.
దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోర్జియా, సకారియా చెరో వికెట్ తీసుకున్నారు.