PAK vs ING: క్రికెట్ మ్యాచుల్లో గాయాలు కామన్. కాగా బ్యాటర్ల బాదుడు ధాటికి ఒక్కోసారి వికీలు, ఫీల్డర్లు, అంపైర్లు గాయపడుతుంటారు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో చోటుచేసుకుంది. పాక్ బ్యాటర్ ఊపుడు దెబ్బకి లెగ్ అంపైర్ క్షతగాత్రుడు అయ్యాడు.
పాకిస్థాన్ వేదికగా ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి విదితమే. కాగా తాజాగా జరిగిన ఆరవ టీ20 మ్యాచ్‌లో అంపైర్ అలీమ్ దార్ గాయపడ్డాడు. పాకిస్థాన్ బ్యాటర్ హైదర్ అలీ కొట్టిన పుల్ షాట్ లెగ్ అంపైర్ అలీమ్ దార్‌కు తగలడం వల్ల ఆయన గాయపడ్డాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో జరిగింది. రిచర్డ్ గ్లీసన్ వేసిన ఆ ఓవర్‌లో బౌలింగ్ చేస్తుండగా బ్యాటర్ హైదర్ పుల్ షాట్ ఆడాడు. దానితో బంతి తనవైపే వస్తున్నట్లు గమనించిన అంపైర్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బాల్ నేరుగా వచ్చి అంపైర్ అలీమ్ తొడలకు గట్టిగా తగిలింది. బాల్ తాకిన వెంటనే అంపైర్ దార్ నొప్పితో బాధపడ్డాడు. ఇకపోతే ఈ కీలకమైన ఆరో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలయ్యింది. మొదట పాక్ 6 వికెట్లకు 169 రన్స్ చేయగా, ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా చేధించింది.
ఇదీ చదవండి: టీమిండియాకు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి బుమ్రా ఔట్