T20 world Cup: ఆసియా కప్ 2022 భాగంగా టీమిండియా ఓటమి పాలైన తరువాత ఇప్పుడు అందరి చూపు టీ20 వరల్డ్ కప్ పైనే ఆశలు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి జరగనుంది. ఈ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా పై క్రికెట్ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారనే చెప్పుకోవాలి. ఈ వరల్డ్ కప్ లో కూడా టీమిండియా మొదట పాకిస్థాన్ తో తలపడనుండగా, ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 23 న జరగనుంది.
ఆసియా కప్ 2022లో టీమిండియా పై అనేక రూమర్లు, విమర్శలు బాగా వచ్చాయి. ఇప్పుడు అదే జట్టుతో టీ20 వరల్డ్ కప్‌కు వెళ్తే గెలుస్తారని నమ్మకమేంటని విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా శ్రీలంక పై టీమిండియా ఓటమి పాలైన తరువాత ఇళ్ళకు వచ్చేసారు. ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని టీమిండియా జట్టులో కొన్ని మార్పులు చేశారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం కొత్త జట్టును బీసీసీఐ ఎంపిక ప్రకటించింది. బీసీసీఐ 15 మందిని సెలెక్ట్ చేసిన కొత్త జట్టును ప్రకటించింది. కొంతమంది స్టాండ్ బైగా ఉండనున్నారని తెలిపింది.
టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా నుంచి పోరాడే క్రికెటర్లు వీరే..
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్,విరాట్ కోహ్లి,హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్,రిషభ్ పంత్, దినేష్ కార్తిక్,చాహల్, అక్సర్, హర్షల్ పటేల్,అర్షదీప్ సింగ్, సీనియర్ బౌలర్ల నుంచి బుమ్రా, భువనేశ్వర్,రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక చేసారు. మొహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చహర్‌లు స్డాండ్‌బైలో ఉండనున్నారని
బీసీసీఐ ప్రకటించింది.