Prime9

IND vs BAN: బంగ్లాపై భారత్ విజయం.. సెమీస్ బెర్త్ ఖాయం

IND vs BAN: భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టుకు మధ్యలో వర్షం ఆటంకం ఏర్పడింది. కాగా కొద్ది సేపటికి వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చెయ్యగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.

185 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు 7 ఓవర్లు పూర్తిచేసే సరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు పూర్తి చేసింది అంతలో వర్షం కురవడంతో మ్యాచ్ కొంచెం సేపు నిలిచిపోయింది. మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది.
దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది. కాగా అయితే, ఆట మొదలైన వెంటనే బంగ్లాదేశ్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. డేజంరస్ బ్యాటర్ దాస్ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. 12వ ఓవర్ తొలి బంతికి అర్షదీప్ బంగ్లా బ్యాటర్ ఆఫిఫ్‌ను పెవిలియన్ చేర్చాడు. డీఎల్ఎస్ నిర్దేశించిన స్కోర్ కోసం పోరాడిన బంగ్లా 5పరుగుల తేడాతో ఓడిపోయింది. 16 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. దానితో భారత్ కు దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయమయ్యింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1

Exit mobile version
Skip to toolbar