SRH vs LSG: దాదాపు సన్ రైజర్స్ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటుండగా మూడో స్థానంలో వచ్చిన పూరన్ ఒక్కసారిగా మొత్తం గేమ్ ను మార్చేశాడు. సన్ రైజర్స్ చేతిలో ఉన్న విన్నింగ్ ను ఒక్కసారిగా తనవైపు లాగేసుకుని వరుస సిక్సులతో పూరన్ లక్నో విజయంలో కీలక ప్లేయర్ గా మారాడు. నిర్ణీత 20 ఓవర్లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం కేతనం ఎగురవేసింది లక్నో జట్టు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు చివర్లో తడబడింది. భారీ స్కోర్ చేసేలా కనిపించిన చివర్లో వికెట్లు పడటంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ 182 పరుగులు చేసింది.