SRH vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. సన్ రైజర్స్ జట్టులో సింగ్, రాహుల్ త్రిపాఠి, చివర్లో అబ్దుల్ సమద్ రాణించారు.
సింగ్ 31 పరుగులు, రాహుల్ త్రిపాఠి 35 పరుగులు చేశారు. చివర్లో 10 బంతుల్లో అబ్దుల్ సమద్ 21 పరుగులు చేశాడు.
లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.