Site icon Prime9

Rohit gets Emotional: మెల్ బోర్న్ స్టేడియంలో జాతీయగీతం ఆలపిస్తూ రోహిత్ తన్మయత్వం

Rohit gets emotional while singing the national anthem at the Melbourne Stadium

Rohit gets emotional while singing the national anthem at the Melbourne Stadium

IND vs PAK: : పుట్టిన గడ్డను స్మరించుకోవడం దేశ పౌరుడిగా అందరి హక్కు. పొరుగు దేశంలో దేశంపై ఉన్న అభిమానాన్ని పంచుకొన్నాడు మన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సంఘటన దాయాది పోరు మ్యాచ్ చోటుచేసుకొనింది. దీన్ని ఐసిసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ అయింది.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ మైదానం ఈ దినం ఉద్విగ్న క్షణాలకు నిలయమైంది. దాయాది దేశం పాకిస్థాన్ పోరులో భాగంగా రెండు దేశాల క్రికెట్ అభిమానులకు ఎంతో కీలకమైన ఈ టోర్నీ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ భావోద్వేగానికి లోనైనాడు. మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో రోహిత్ శర్మ తన్మయత్వంతో ఉప్పొంగిపోయాడు. జనగణమన ముగించిన అనంతరం గుండెల నిండా ఊపిరి పీల్చుకొన్నాడు. ఆ సమయంలో అతని కళ్లు చెమర్చడం కనపడింది.

ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను కదిలించింది. ఈ భావోద్వేగాలు స్వచ్ఛమైనవిగా పేర్కొంటూ ఐసీసీ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. రెండు మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకొన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: IND vs PAK: టీం ఇండియా టార్గెట్ @160

Exit mobile version