Site icon Prime9

NZ vs PAK: సెమీస్ లో గెలిచిన పాకిస్తాన్.. భారత్ తో ఫైనల్ పోరు..?

pakistan-wins-the-t20-worldcup-first-semi-final-and-reached-to-final

pakistan-wins-the-t20-worldcup-first-semi-final-and-reached-to-final

NZ vs PAK: భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన దాయాదీ జట్టు పాకిస్థాన్‌ పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ సిడ్నీ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ తొలి సెమీస్‌ మ్యాచ్ లో భాగంగా కివీస్‌పై పాక్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు తేడాతో చేధించింది. 13 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ ఆరంభంలో దూకుడు ప్రదర్శించింది. డారిల్‌ మిచెల్‌ (53) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. కేన్‌ విలియమ్సన్‌ (46) రాణించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాటర్లంతా పేలవంగా ఆడడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కివీస్‌ 152 పరుగులు చేసి దాయాదీ జట్టుకు 153 పరుగుల టార్గెట్ ఇచ్చింది.

153 పరుగుల లక్ష్యంతో క్రీజ్ లోకి దిగిన పాకిస్థాన్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. బాబర్‌ ఆజామ్‌ (53), మహమ్మద్‌ రిజ్వాన్‌ (57)లు హాఫ్‌ సెంచరీలతో చెలరేగి కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 12 ఓవర్లు ముగిసేలోపు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 102 పరుగులు చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన మహమ్మద్‌ హారిస్‌ (30) కూడా ఫర్వాలేదనిపించాడు. చివరి క్షణాల్లో హారిస్‌ ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే కివీస్ ఇచ్చిన లక్ష్యాన్ని పాక్‌ చేధించింది. దీనితో పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరుకుంది.

రెండో సెమీస్‌లో భాగంగా రేపు అనగా గురువారం ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. వీరిలో గెలిచిన జట్టుతో ఆదివారం నాడు జరిగే ఫైనల్‌ మ్యాచ్ లో పాకిస్థాన్‌ తలపడనుంది. ఇకపోతే క్రికెట్ లవర్స్ అంతా ఇండియా, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే బాగుండు అని భావిస్తున్నారు. ఈ చిరకాల ప్రత్యర్థులిద్దరూ బరిలో హోరాహోరీ పోరాడితే ఉండే ఆ మజా వేరే లెవెల్లో ఉంటుంది. కాగా రేపు జరిగే మ్యాచ్ ఫైనల్ పోటీదారులను డిసైడ్ చేస్తుంది.

ఇదీ చదవండి:  అశ్విన్ పై నాకు నమ్మకం రావట్లేదు.. కపిల్ దేవ్!

 

 

Exit mobile version
Skip to toolbar