Site icon Prime9

SA vs NED: సౌతాఫ్రికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్.. సెమీస్ కు చేరిన భారత్

netherlands-beat-south-africa-by-13-runs-and-proteas-knocked-out-from-t20-world-cup-2022

netherlands-beat-south-africa-by-13-runs-and-proteas-knocked-out-from-t20-world-cup-2022

SA vs NED: సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. సెమీఫైనల్ కు చేరుతుందని భావించిన సౌతాఫ్రికా జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓటమిని చదవిచూసింది. దానితో సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలుపొందాల్సిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగులతో తేడాతో విజయం కైవసం చేసుకుంది. 159 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసి ఓడింది. దాంతో సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. నేడు జరుగనున్న జింబాబ్వే మ్యాచ్ లో గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది.

నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3 వికెట్లతో సఫారీ నడ్డి విరిచాడు. బాస్ డీ లీడ్ 2, ఫ్రెడ్ క్లాసెన్ రెండేసి వికెట్లు తీశారు. రైలీ రోసో (25) టాప్ స్కోరర్ కావడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ బౌలర్లు కట్టడి చేశారు. క్వింటన్ డికాక్ (13), బవుమా (20), మార్కరమ్ (17) క్లాసెన్ (21), మిల్లర్ (17) కట్టకట్టుకుని విఫలం అయ్యారు.
దాంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కోలిన్ అకర్ మన్ (26 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నెదర్లాండ్స్ కు అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడు. టామ్ కూపర్ (19 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం చేశాడు. అలా మొత్తానికి నెదర్లాండ్స్ జట్టు గెలిచినా ఇంటి ముఖం పట్టింది మరియు తాను పోతూ పోతూ సౌతాఫ్రికా జట్టును కూడా ఇంటి దారి పట్టించింది.

ఇదీ చదవండి: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

 

Exit mobile version