Site icon Prime9

Jasprit Bumrah: బుమ్రా భావోధ్వేగం.. ఆస్ట్రేలియా వెళ్తా అంటూ ట్వీట్

jasprit bumrah very emotional on his absence of india t20 wc

jasprit bumrah very emotional on his absence of india t20 wc

Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్‌ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీం ఇండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.

వెన్ను నొప్పి గాయంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్న బుమ్రా టీ20 ప్రపంచకప్ ఆడడం లేదని బీసీసీఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
కాగా బుమ్రా ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ‘బుమ్రా గాయం తగ్గడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ప్రపంచకప్‌లో ఆడలేడని మెడికల్ రిపోర్ట్స్, నిపుణుల సలహాలు, సూచనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపాడు.
అయితే బుమ్రాకు రీప్లేస్‌‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్ వేదికగా బుమ్రా స్పందించారు. ఆడినా ఆడకున్నా తాను ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పాడు. ‘ఈసారి నేను ప్రపచంకప్ ఆడటం లేదు. కానీ నేను కోలుకోవాలని విష్ చేసిన నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు. నేను ఆసిస్కు వెళ్లి నా జట్టుకు సపోర్ట్ చేస్తానని అని బుమ్రా ట్వీట్ చేశాడు.

ఇదీ చదవండి: పాక్ బ్యాటర్ దెబ్బ.. అంపైర్ అబ్బ..!

Exit mobile version