IND vs NZ ODI: నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ వేదికగా వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్ కు సర్వం సిద్దమైయ్యింది.
కాగా, ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లను ఇప్పటికే హెచ్.సి.ఏ ఆన్లైన్ విక్రయాలు నిర్వహించింది.
అయితే, ఈ టిక్కెట్ల విక్రయాల్లో గోల్ మాల్ జరిగిందని ఓ వైపు పుకార్లు వినిపిస్తుండగా.. మరో వైపు మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బ్లాక్ టిక్కెట్ల విక్రయాలపై నిఘా పెట్టింది.
ఈ తరుణంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద మంగళవారం నాడు బ్లాక్ల్ లో భారత్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్లను విక్రయిస్తున్న 15 మంది యువకులను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 54 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుండగా టిక్కెట్లు ఉన్నవారిని స్టేడియంలోకి 10.30 అనుమతిస్తున్నారు.
స్టేడియం వద్ద పకడ్బంధీ తనిఖీల అనంతరం ప్రేక్షకులకు వారికి కేటాయించిన టిక్కెట్టు ప్రకారం సీట్లలోకి అనుమతిస్తున్నారు.
భారత్ న్యూజిలాండ్ వన్డే(IND vs NZ ODI) మ్యాచ్ కు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది.
నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో భారత్ వన్డే మ్యాచ్ జరుగుతుంది.
దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ సి ఏ ఎంటువంటి అవాంతరాలు రాకుండా పూర్తి ఏర్పాట్లు చేసింది. సుమారు 40 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ ని వీక్షించే అవకాశం ఉంది.
ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే ఈ మ్యాచ్ కి హెచ్.సి.ఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాచకొండ పోలీసులు సుమారు 2500 మంది పొలిసు సిబ్బందిని నియమించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ మరియు న్యూజిల్యాండ్ ప్లేయర్స్ హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.
మంగళవారం ప్రాక్టీస్ సెషన్ కూడా నిర్వహించారు. కాగా నేడు ఇటు జట్లు ముఖాముఖీ తలపడనున్నాయి.
భారత జట్టు హైదరాబాద్ లో చాలా కాలం తర్వాత వన్డే ఆడుతుండడంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులే కాకా యావత్ దేశ ప్రజలు టీమిండియా విజయం సాధించాలని ఆశిస్తున్నారు.
మరి ఈ సిరీస్ ను ఎవరు సొంతం చేసుకోనున్నారో వేచిచూడాల్సి ఉంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/