Site icon Prime9

Guinness World Records: టీమిండియా ఓటిమిపై “గిన్నిస్ వరల్డ్ రికార్డ్” సెటైర్స్

guinness-world-records-trolls-team-india-over-semi-final-defeat-to-england

guinness-world-records-trolls-team-india-over-semi-final-defeat-to-england

Guinness World Records: టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టుకు భారత్ ప్లేయర్లు అసలు పోటీ కూడా ఇవ్వకుండా చిత్తుచిత్తుగా ఓటమిపాలైన నేపథ్యంలో అభిమానులు తమదైన శైలిలో అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు. రకరకాల మీమ్స్‌, ట్రోల్స్ తో భారత్‌ జట్టుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ తరుణంలోనే నేనేమైనా తక్కువా అంటూ ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు’ కూడా భారత్‌ ఘోర పరాభవంపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘చరిత్రలో అతిసులువైన ఛేదన ఇదేనా?’’ అంటూ సెటైర్లు విసిరింది. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

నవంబర్ 10 గురువారం నాడు భారత్-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారతజట్టు చిత్తుగా ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. అటు బౌలింగ్ పరంగానూ ఇటు బ్యాటింగ్ పరంగానూ పూర్తిగా ఫిలమయ్యింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఓపెనర్లు బట్లర్‌ (80 నాటౌట్‌), హేల్స్‌ (86 నాటౌట్‌) అలవోకగా చేధించారు. కేవలం 16 ఓవర్లలోనే విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ నెల 13న ఫైనల్‌లో దాయాది జట్టుతో తపడనున్నారు. పైనల్లో పాకిస్థాన్‌తో పోటీపడతామని భావించిన భారత్‌ క్రికెట్‌ అభిమానులను ఈ సెమీస్లో టీమిండియా పొందిన పరాజయం తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా వారివారి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రేమ పేరుతో బెదిరించి తాళికట్టి.. ఆపై అత్యాచారం

Exit mobile version