నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చివర్లో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ లో జోస్ బట్లర్ 52 పరుగులతో రాణించాడు. పడిక్కల్ 38 పరుగులు చేయగా.. అశ్విన్, హెట్ మేయర్ చెరో 30 పరుగులు చేశారు.
చెన్నై బౌలింగ్ లో ఆకాష్ సింగ్, దేశ్ పాండే, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మెుయిన్ అలీ ఓ వికెట్ తీసుకున్నాడు.