Site icon Prime9

లియోనాల్ మెస్సీ : ఆ విషయంలో క్రికెట్ గాడ్ సచిన్ తో మెస్సీకి పోలిక..

comparing between indian cricketer sachin tendulkar and lionel messi

comparing between indian cricketer sachin tendulkar and lionel messi

Lionel Messi : ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరైన లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్‌లోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నాడు. మెస్సీ సారథ్యం లోని అర్జెంటీనా ప్రపంచకప్‌ ఫైనల్ లో ఫ్రాన్స్‌పై ఆడి విజయం సాధించింది. మెస్సీకి ఇదే తొలి ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. ఇటీవలే ఇదే తన చివరి ప్రపంచ కప్ అని ప్రకటించిన మెస్సీ… ప్రపంచకప్ ని ముద్దాడకుండానే ఫుట్ బాల్ కి వీడ్కోలు పలుకుతాడేమో అని ఆయన అభిమనులంతా ఒకింత కంగారు పడ్డారు.

కానీ ఒక దిగ్గజ ఆటగాడికి ప్రపంచకప్ అనేది ఒక తీపి గుర్తు లాంటిది. అలాంటి వరల్డ్ కప్ ని గెలుచుకోకుండా… మెస్సీ తన కెరీర్ కి గుడ్ బై చెప్పకూడదని అంతా భావించారు. వారందరి కలని సాకారం చేస్తూ తన టీమ్ కి సాకర్ వరల్డ్ కప్ ని గెలిపించాడు మెస్సీ. అయితే ఇప్పుడు తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ కి, మెస్సీకి కొన్ని విషయాల్లో పోలికలు ఉండడం గమనార్హం. క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన సచిన్‌, ఫుట్‌బాల్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన మెస్సిల మధ్య పోలికలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా…

సచిన్ తో మెస్సీ పోలికలు …

– క్రికెట్లో సచిన్‌ పదో నంబర్‌ జెర్సీని ధరిస్తే… ఫుట్‌బాల్‌లో మెస్సి జెర్సీ నంబర్ కూడా పదే.
– 2003లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమితో నిరాశ చెందిన సచిన్… ఎనిమిదేళ్ల తర్వాత 2011 లో ప్రపంచకప్‌ను అందుకున్నాడు. అలానే 2014 ఫైనల్లో రన్నరప్‌గా వచ్చిన మెస్సీ… మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు సాకర్ కప్పును సొంతం చేసుకున్నాడు.
– అదే విధంగా 2011 ప్రపంచ కప్‌ సెమీస్‌లో సచిన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకుంటే. 2022 ప్రపంచకప్‌ సెమీస్‌లో మెస్సీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

క్రీడలు వేరైనప్పటికి… ఆయా క్రీడల్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్న ఈ ఇద్దరికి మధ్య ఇలాంటి పోలికలుండడం పట్ల వారి అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.

13 ఏళ్ల వయసు లోనే ఫుట్‌బాల్‌ బరిలోకి దిగిన లియోనెల్‌ మెస్సీ, 2004లో బార్సిలోనా క్లబ్ లో సభ్యుడిగా చేరి కెరీర్ ని ప్రారంభించాడు. 2004-05 మధ్య అర్జెంటీనా అండర్ 20 జట్టులో ఆడుతూ 14 గోల్స్ చేసి చరిత్ర సృష్టించాడు. 2008లో అండర్ 20 జట్టు తరపున ఆడుతూ 2 గోల్స్ చేశాడు. ఆ తర్వాత 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతూ 90 గోల్స్ కొట్టాడు. 2005 ఫిఫా వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న మెస్సీ, అదే టోర్నీలో గోల్డెన్ బాల్ గోల్డెన్ షూను తొలిసారి కైవసం చేసుకున్నారు. ఇక 2008 ఒలింపిక్స్ లో మెస్సీ గోల్డ్ మెడల్ కూడా సాధించాడు.

మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌…

మెస్సీ అంతర్జాతీయ కెరీర్ ను పరిశీలిస్తే అర్జెంటీనా తరఫున ఆడుతూ 90 గోల్స్ చేశాడు. బార్సిలోనా తరఫున మెస్సీ కూడా మంచి ప్రదర్శన చేశాడు. అతను 2004 నుండి 2021 వరకు ఈ జట్టు కోసం ఆడిన 520 మ్యాచ్‌లలో 474 గోల్స్ చేశాడు. అతను ప్రపంచం లోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడి కొనసాగుతున్నాడు. లియోనెల్‌ మెస్సీ 2006, 2010, 2014, 2018 ప్రపంచ కప్‌ పోటీల్లో ఆడారు. చివరికి ఈ ప్రపంచ కప్ తో తన కలను సాకారం చేసుకున్నాడు మెస్సీ. ఫుట్ బాల్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను ముద్రించుకున్న మెస్సీకి … తన జట్టుకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతి ఈ ప్రపంచకప్.

Exit mobile version