Site icon Prime9

Asian Athletics Championship : 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో అదరగొట్టిన తెలుగు తేజం..

cm jagan tweet on 25th asian athletics championship

cm jagan tweet on 25th asian athletics championship

Asian Athletics Championship : థాయ్ లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో తెలుగు క్రీడాకారులు అదరగొడుతున్నారు. అద్భుత ప్రదర్శనతో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్ 2023 లో బంగారు పతకం సాధించింది వైజాగ్ అమ్మాయి “జ్యోతి యర్రాజు”. ఈ మేరకు ఆ క్రీడాకారిణికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. యావత్ భారతదేశమే గర్వపడేలా చేసిందని.. ఏపీ ప్రజలందరి తరపున జ్యోతి యర్రాజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

కాగా జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో బంగారు పతకం సాధించింది. ఇక పురుషుల 1500 మీట్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ కూడ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. పురుషుల ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ స్వర్ణం సాధించాడు. ఇలా రెండురోజుల్లో భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి. అదే విధంగా వెయ్యి మీటర్ల రేసులో అభిషేక్ పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల 400 మీటర్ల రేసులో ఐశ్వర్య కైలాష్ మిశ్రా కాంస్యాన్ని సాధించింది. పురుషుల డెకథ్లాన్ లో తేజస్విన్ శంకర్ కాంస్యం దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటివరకు భారత్ ఆరు పతకాలు సాధించింది.

జూలై 12న థాయ్ లాండ్ లో మొదలైన ఆసియా అథ్లెటిక్స్ ఛాపింయన్ షిప్ 2023.. 16వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే 3 స్వర్ణాలు, 3 కాంస్య పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా మరికొన్ని విభాగాల్లో ఇంకొందరు క్రీడాకారులు పోటీ పడనున్నారు. దీంతో భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

 

Exit mobile version