CSK vs DC: ఐపీఎల్ లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్ లో ఫ్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుకావాలంటే.. చెన్నై తప్పక విజయం సాధించాలి. చివరి స్థానంలో ఉన్న దిల్లీ.. పోటీలో నిలవాలన్న ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. దీంతో నేడు జరిగే పోరు కీలకం కానుంది. ఇక చెన్నై బౌలింగ్ లో అదరగొడుతుంటే.. దిల్లీ మిడిలార్డర్ బ్యాటింగ్ తో రాణిస్తోంది.
కీలక పోరు.. (CSK vs DC)
ఐపీఎల్ లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్ లో ఫ్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుకావాలంటే.. చెన్నై తప్పక విజయం సాధించాలి. చివరి స్థానంలో ఉన్న దిల్లీ.. పోటీలో నిలవాలన్న ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. దీంతో నేడు జరిగే పోరు కీలకం కానుంది. ఇక చెన్నై బౌలింగ్ లో అదరగొడుతుంటే.. దిల్లీ మిడిలార్డర్ బ్యాటింగ్ తో రాణిస్తోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తీవ్ర పోటీ నడుస్తుంది. లీగ్ మ్యాచులు చివరి దశకు చేరడంతో.. ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. ఫ్లే ఆఫ్స్.. కొన్ని జట్లకు సంక్లిష్టం కాగా.. మరికొన్ని జట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
చెన్నైదే ఆధిపత్యం
ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నైదే ఆదిపత్యం. ఇప్పటి వరకు జరిగిన 27 మ్యాచుల్లో.. చెన్నై 17 మ్యాచుల్లో, దిల్లీ 10 మ్యాచుల్లో విజయం సాధించాయి.
ఈ సీజన్‌లో మాత్రం ఇరు జట్లూ తొలిసారి తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో బెన్‌స్టోక్స్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
దూకుడుగా ఆడుతున్న అజింక్య రహానె దిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మాత్రం గతంలో ఇబ్బందిపడ్డాడు.
వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
మరోవైపు దిల్లీ టాప్ ఆర్డర్‌లో దుమ్మురేపుతున్న సాల్ట్, వార్నర్, మిచెల్ మార్ష్‌ను యువకులతో కూడిన చెన్నై పేస్ దళం అడ్డుకోగలిగితే సగం విజయం సాధించినట్లే.
కుల్‌దీప్ కీలకం..
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో కుల్ దీప్ బౌలింగ్ కీలకం కానుంది.
మరో ఓపెనర్ డేవన్ కాన్వే.. శివమ్ దూబె కూడా రాణిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గే జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.