Site icon Prime9

Bumrah: ఐపీఎల్‌ నుంచి బుమ్రా ఔట్‌.. ముంబై ఇండియన్స్‌ కు భారీ షాక్‌.. .!

bumrah

bumrah

Bumrah: ఐపీఎల్ ప్రారంభానికి ముందు.. ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్.. జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. కొద్ది రోజులుగా బుమ్రా గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబైకి గట్టి షాక్ తగిలింది.

క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా.. (Bumrah)

గాయం కారణంగా.. కొద్ది రోజులుగా క్రికెట్ కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలాఖరులో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ ద్వారా క్రికెట్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని.. బీసీసీఐ, ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ కు బుమ్రా దూరం కానున్నాడు. బుమ్రా గాయం గతంలో కన్నా.. ప్రస్తుతం దాని తీవ్రత ఎక్కువ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు ప్రకటించారు. ఐపీఎల్‌-2023 సీజన్‌తో పాటు.. జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండడం అనుమానమేనని సూచనప్రాయంగా వెల్లడించాయి.

గల్లంతైన టీమిండియా ఆశలు..

పేసర్ బుమ్రా గాయం నుంచి కోలుకుంటాడని అందరు భావించారు. బుమ్రాను ఆసియా కప్‌ సమయానికి జట్టులోకి తీసుకురావాలని టీమిండియా భావించింది. కానీ గాయం ఎక్కువ కావడంతో.. భారత జట్టు ఆశలు అడియాశలుగా మారాయి. బుమ్రా గాయం ప్రభావం.. ముంబై ఇండియన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న​ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఫిట్‌నెస్‌ సాధించేందుకు శతవిధాల శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా.. ఆస్ట్రేలియాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెండిటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. మూడో టెస్ట్‌ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. టెస్ట్‌ సిరీస్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడతాయి. తొలుత వన్డే సిరీస్‌ సమయానికి కంతా బుమ్రా ఫిట్‌గా ఉంటాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ బుమ్రా.. టీమిండియా, ముంబై ఇండియన్స్‌లకు భారీ షాకిచ్చాడు.

Exit mobile version