Bajrang Punia: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 4 పతకాలు గెలిచిన తొలి భారత రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
సెర్బియాలోని బెల్గ్రేడ్‌లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కాంస్య పోరులో 11-9 తేడాతో పోర్టోరికోకు చెందిన సెబాస్టియన్ సి రివేరాను భారత రెజ్లర్ బజరంగ్ పునియా ఓడించాడు. హోరాహోరిగా సాగిన పురుషుల 65 కిలోల కాంస్య పోటీలో బజరంగ్ పునియా తొలుత వెనుకబడినా.. తర్వాత పుంజుకుని కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇద్దరూ కొదమసింహాల్లా రెజ్లింగ్ రింగ్‌లో పోరాడారు. మ్యాచ్ ఇంకా రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా పునియా రెండు కీలక పాయింట్లు సాధించి విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు.
ఈ గెలుపుతో పునియా.. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగు పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్‌గా రికార్డుకెక్కాడు. పునియా గతంలో.. 2018లో రజతం గెలువగా 2013, 2019, 2022లలో కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. కాగా పునియా కంటే ముందు మహిళల 53 కిలోల విభాగంలో పోగట్ కాంస్యం గెలుచుకున్న విషయం విదితమే.
ఇదీ చదవండి: Yuvraj singh: యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి నేటికీ 15 ఏళ్ళు