Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోమవారం 35 పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో.. భార్య పుట్టిన రోజు సందర్భంగా భార్యకు స్పెషల్ నోట్ తో బర్త్ డే విషెస్ చెప్పారు. అనుష్క కు సంబంధించిన స్పెషల్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నా సర్వస్వం నువ్వే’ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం విరాట్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పలువురు అనుష్క కు నెట్టింట్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీ చేయి వీడను. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా నీకు నేను తోడుంటాను. నీతో పాటు నీకున్న అలవాట్లను కూడా అంతే ప్రేమిస్తాను. నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ అనుష్కపై తనకున్న ప్రేమను కురిపించాడు విరాట్ కోహ్లి.
Love you through thick, thin and all your cute madness ♾️. Happy birthday my everything ❤️❤️❤️ @AnushkaSharma pic.twitter.com/AQRMkfxrUg
— Virat Kohli (@imVkohli) May 1, 2023
2017 డిసెంబరులో ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘రబ్ నే బనాదీ జోడీ’ సినిమాతో అనుష్క శర్మ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఓ కమర్షియల్ యాడ్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. దాదాపుగా నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2021 జనవరిలో కూతురు వామిక జన్మించింది.
తాత్కాలిక కెప్టెన్‌గా కోహ్లీ బిజీ(Anushka Sharma)
కాగా, మరోవైపు ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అనూహ్య పరిస్థితుల్లో ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక బ్యాటర్‌గానూ అదరగొడుతూ.. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి 333 పరుగులు చేశాడు. కోహ్లీ అత్యధిక స్కోరు 82 నాటౌట్. ఇదిలా ఉంటే ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది.