Ajinkya Rahane: అజింక్యా రహానే.. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న పేరు. తన విధ్వంస ఆటతో చెన్నైకి ఆలవోక విజయాన్ని అందించాడు. కానీ ఐపీఎల్ మినీ వేలంలో కొనడానికి ఏ జట్టు కూడా ముందుకు రాలేదు. చెన్నై మాత్రం అతడిని కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే సీజన్ ప్రారంభానికి ముందు ధోని.. రహానేకు అభయమిచ్చాడు. ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని రహానే చక్కగా వినియోగించుకున్నాడు.
ధోని ఏమన్నాడంటే.. (Ajinkya Rahane)
అజింక్యా రహానే.. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న పేరు. తన విధ్వంస ఆటతో చెన్నైకి ఆలవోక విజయాన్ని అందించాడు. కానీ ఐపీఎల్ మినీ వేలంలో కొనడానికి ఏ జట్టు కూడా ముందుకు రాలేదు. చెన్నై మాత్రం అతడిని కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే సీజన్ ప్రారంభానికి ముందు ధోని.. రహానేకు అభయమిచ్చాడు. ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని రహానే చక్కగా వినియోగించుకున్నాడు. ఈ సీజన్ లో నీ ఆట నువ్వు ఆడు.. అంటూ రహానేకు ధోని భరోసా ఇచ్చాడు. దీంతో తొలి మ్యాచ్ లోనే రహానే తానెంటో నిరూపించుకున్నాడు.
అదరగొట్టిన రహానే..
ఈ సీజన్లో తొలిసారి అజింక్యా చెన్నై తరపున బరిలోకి దిగాడు. వచ్చి రావడంతోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రహానేను చెన్నై రూ.50 లక్షల ప్రాథమిక ధరకు సొంతం చేసుకుంది.
గత సీజన్లో రహానే ఘోరంగా విఫలం అయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడి.. ఏడు ఇన్నింగ్స్ ల్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో అతడిని కేకేఆర్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత టెస్టు జట్టులోను స్థానం కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.
కనీస ధరకు చెన్నై సొంతం చేసుకుంది. ఐపీఎల్ 16 ప్రారంభానికి ముందు.. రహానేతో ధోని మాట్లాడి. ఆత్మవిశ్వాసం నింపాడు.
స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని సూచించినట్లు ధోని తెలిపాడు.
అజింక్య రహానేపై ధోనీ మాటలు మంత్రంలా పని చేశాయి. చెన్నై తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే రహానే చెలరేగాడు.
19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రహానే.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రహానేకు భిన్నమైన ఆటగాడు ఈ మ్యాచ్‌లో కనిపించాడు.