MI vs RCB: ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే స్డేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ రెండు జట్లు గత మ్యాచుల్లో ఓడిపోయి.. బరిలోకి దిగుతున్నాయి.
కీలక పోరు.. (MI vs RCB)
ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది.
వాంఖడే స్డేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
అయితే ఈ మ్యచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ రెండు జట్లు గత మ్యాచుల్లో ఓడిపోయి.. బరిలోకి దిగుతున్నాయి.
గత మ్యాచ్ లో దిల్లీ చేతిలో బెంగళూరు ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బౌలర్లు చేతులెత్తేశారు.
ఇక చెన్నై చేతిలో ముంబయి దారుణంగా ఓటమిపాలైంది.
దీంతో నేడు జరిగే మ్యాచ్ లో ముంబయి రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
లేమితో స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్ స్థానంలో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
అదే విధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఆనారోగ్యం కారణంగా దూరమైన తిలక్ వర్మ కూడా తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆర్సీబీ కూడా ఒక మార్పు చేసే ఛాన్స్ ఉంది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అనుజ్ రావత్ స్థానంలో ప్రభ్‌దేశాయ్ రానున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటి వరకు చెరో 10 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు ఐదింట విజయం సాధించాయి.
తుది జట్లు(అంచనా)ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోర్డాన్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, అర్షద్ ఖాన్.
ఆర్సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, కరణ్ శర్మ మహ్మద్ సిరాజ్.