AP, TS Richest Persons List 2022: తెలుగు వారు ఏ రంగంలోనై రాణించగలరు ఎన్ని రికార్డులైనా నెలకొల్పగలరు అన్నది నానుడి కాదండో అక్షరాల నిజం. సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురూన్ రిచ్‌లిస్ట్-2022లో మెరుగైన ర్యాంకులన్నీ మన తెలుగువారే సాధించారు. మొత్తంగా 78 మంది తెలుగు బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి. వీరి మొత్తం సంపద విలువ దాదాపుగా రూ.3,90,500 కోట్లుగా ఉందని ఐఐఎఫ్ఎల్ నివేదిక వెల్లడించింది. మరి తెలుగు రాష్ట్రాల్లోని రిచ్చెస్ట్ పర్సన్స్ ఎవరో ఓ లుక్కేద్దామా…
ఎక్కువగా హైదరాబాద్‌కు సంబంధించి ఫార్మా వ్యాపారవేత్తలే ఈ స్థానాల్లో ఉన్నారని నివేదక పేర్కొనింది. దివీస్ లెబొరేటరీస్ ప్రమోటర్ మురళీ దివి, ఆయన కుటుంబం ఈ సర్వేలో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద 29 శాతం తగ్గినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను మించిన కోటీశ్వరుడు మరెవరు లేరు.
హెటెరో గ్రూప్ అధినేత బి.పార్థసారథి రెడ్డి తెలుగు సంపన్నుల్లో రెండో స్థానం కైవసం చేసుకున్నారు. గతేడాది ఆయన సంపద రూ.26,100 కోట్లు కాగా ఈ సారి 50 శాతం వృద్ధితో రూ.39,200 కోట్లకు చేరుకున్నారు. ఎంఎస్‌ఎన్ లెబొరేటరీస్ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ రెడ్డి రూ.16,000 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. బయలాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లా రూ.8700 కోట్లతో టాప్-10లో నిలిచారు. కాగా ఈ నివేదికలో టాప్ 10లో నిలిచిన ఏకైక మహిళగా ఈమె గుర్తింపు పొందారు.
మొత్తంగా అగ్రశ్రేణి పది మందిలో ఆరుగురు ఫార్మా పరిశ్రమకు చెందినవారే. రూ.11,300 కోట్లతో కే.సతీశ్ రెడ్డి-డాక్టర్ రెడ్డీస్ కుటుంబం, రూ.9000 కోట్లతో సువెన్ ఫార్మా జాస్తి వెంకటేశ్వర్లు- కుటుంబం వరుసగా 8, 9 స్థానాలను సొంతం చేసుకున్నారు. మౌలిక నిర్మాణ సంస్థ జీఏఆర్ గ్రూప్స్, అమరేందర్ రెడ్డి, మై హోం జూపల్లి రామేశ్వర రావ్, మేఘ ఇంజినీరింగ్ పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి వరుసగా 4, 5, 6, 7 స్థానాల్లో ఉన్నారు. కాగా హైదరాబాద్ నుంచి 69 మంది సంపన్నులు ఉండగా ఇక విశాఖ నుంచి ఐదుగురు, విజయవాడ నుంచి ఒకరు ఈ నివేదికలో స్థానం దక్కించుకున్నారు.
ఇదీ చదవండి: 12 Indians networth: 12 మంది భారతీయుల నికర విలువ లక్షకోట్ల కంటే ఎక్కువ