Prime9

Janasena Party: ప్యాకేజితోనే వారికి మంత్రి పదవులు.. జనసేన నాయకురాలు డాక్టర్ వెంకటలక్ష్మీ

Andhra Pradesh: జగన్ మంత్రివర్గంలోని కొంతమంది మంత్రులు ప్యాకేజీలతో పాలన చేస్తున్నారని దెందలూరు నియోజకవర్గ జనసేన నాయకురాలు డాక్టర్ వెంకటలక్ష్మీ గంటసాల పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరొక్కసారి ప్యాకేజి పవన్ కల్యాణ్ అంటే ఒప్పుకోమని ఆమె హెచ్చరించారు.

మంగళగిరి కార్యకర్తల సమావేశంలో వ్యక్తిగత లెక్కలు కూడా పవన్ చెప్పారని గుర్తు చేశారు. పేర్నినాని, కన్నాబాబుతో పాటు మరికొందరు ప్యాకేజి రాజాలుగా వైకాపాలో ఉన్నారని ఆమె అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధి వారికి పట్టదని ఎద్దేవా చేశారు.

ఇకపై ఊరుకొనేది లేదని తేల్చి చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని ఆవేశంగా పేర్కొన్నారు. వైకాపా శ్రేణులకు బుద్ధి చెప్పేందుకే ఈ సమావేశం అని అన్నారు. ఇప్పటివరకు తీసుకొన్న ప్యాకేజీని వదిలేసి, ఇకనైనా ప్రజా సమస్యల పై దృష్టి పెట్టండని విజ్ఞప్తి చేశారు. రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఇక యుద్ధమే.. కరాళధ్వనుల నడుమ సిద్ధమేనన్న జనసేన సైనికులు

Exit mobile version
Skip to toolbar