Site icon Prime9

Pavan Kalyan : రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా మా వైసిపి కి ఇస్తావా.. పవన్ కళ్యాణ్

pavan rushilonda

pavan rushilonda

 Pavan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‌ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు వేశారు. తాను ప్రస్తుతం విశాఖలో బస చేస్తున్న నోవాటెల్ హోటల్‌లోని గది కిటికీ‌లో నుంచి అభిమానులకు అభివాదం చేశారు. హోటల్ ముందు తనకు మద్దతు తెలిపేందుకు పెద్ద తరలివచ్చిన జనసైనికులకు సంబంధించి వీడియోను కూడా పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. ఏపీ డీజీపీ కీ ముఖ్యమంత్రి కీ. ఓ వీడియో పోస్ట్ చెశారు.. ఎక్కడో మీటింగ్ ర్యాలీ కాదు.. నేను బస చెస్తున్న హోటల్ క్రింద ఉన్న అభిమానులు అని పోస్ట్ చెశారు.

వైఎస్ ఆర్ సీపీ నేతలు ను ఉద్దేశించి ఉడతా ఉడతా ఉచ్ ఎక్కడ వెళ్తావ్ రుషికొండ మీద జామ పండు కోస్తావా మా వైసిపి కి ఇస్తావా .మా ధానోస్ గూట్లో పెడతావా అని వ్యంగ్యంగా పోస్ట్ చెశారు..తన గది కిటికీలోంచి అభిమానులను పలకరించవద్దని ఏపీ పోలీసులు తనకు చెప్పరని ఆశిస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం జగన్‌ను థానోస్ అని అన్నారు.నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చిందని.. సాయంత్రం కాసేపు అలా చల్లగాలికి ఆర్కే బీచ్‌లో తిరిగితే ఎలా ఉంటుంది..? ఇంతకూ నాకు అనుమతి ఉందా అంటూ ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ థానోస్ గొప్ప నాయకత్వం కింద పనిచేస్తున్న ప్రియతమ ఏపీ పోలీసులు.. నన్ను జనసేన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. నా గది కిటికీలోంచి పలకరించేలా.. ఈ ఆప్షన్‌ను మాత్రమే నాకు వదిలిపెట్టారు అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version