Site icon Prime9

వెంకయ్య నాయుడు: సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్.. ఆ ఆరుగురు మహిళలే కారణమంటున్న వెంకయ్య నాయుడు

venkaiah naidu

venkaiah naidu

Venkaiah Naidu: ఎన్టీఆర్‌ వెన్నుపోటు ఎపిసోడ్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెన్షేషనల్‌ కామెంట్స్‌ చేశారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆనాడు జరిగిన పలు సంఘటనలు గుర్తుచేసుకుంటూ అన్ రివీల్డ్ సీక్రెట్స్‌ను బయటపెట్టారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు చారిత్రక పురుషుడంటూ వెంకయ్య కొనియాడారు. సినీరంగంలోనే కాకుండా, రాజకీయాల్లో విప్లవం తీసుకొచ్చిన మహావ్యక్తి అని ఆయనో మహా నాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. మహిళలు సైతం రాజకీయాల్లో రాణించేలా ప్రోత్సహించారని అన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పై జరిగిన వెన్నుపోటు ఎపిసోడ్ కు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్‌ ఎలాంటి కల్మషం లేని వ్యక్తని, రాజకీయాల్లో కూడా అంతే భోళాతనంగా ఉండేవారని వెంకయ్యనాయుడు అన్నారు. అందరినీ నమ్మేవారని, బహుశా అదే ఆయనకు వెన్నుపోటుకు కారణమై ఉండొచ్చని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

ఒకసారి ఎన్టీఆర్‌తో తాను కలిసి కూర్చొని ఉండగా ఆరుగురు మహిళలు వచ్చి ఆయన కాళ్లకు నమస్కరించారని, కొన్నాళ్లకు వాళ్లే ఆ వెన్నుపోటు ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఆనాడే నేను వాళ్లెందుకు మీ కాళ్లకు దండం పెట్టారని ఎన్టీఆర్‌ను అడిగానని.. దానికి ఆయన స్పందిస్తూ ప్రేమ, అభిమానంతో కాళ్లకు నమస్కరించారని అన్నారని.. అయితే తాను మాత్రం అది ప్రేమ కాదని చెప్పానంటూ గుర్తుచేసుకున్నారు చివరికి, తాను చెప్పిందే నిజమైందన్నారు వెంకయ్య. ఎన్టీఆర్‌ తన వెనుక జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను గమనించలేకపోవడం వల్లే వెన్నుపోటుకు గురయ్యారని వెంకయ్యనాయుడు అన్నారు. కాగా ప్రస్తుతం వెంకయ్యనాయుడు చేసిన ఈ కామెంట్స్‌ సంచలనంగా మారాయి. ఇంతకీ, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడచిన ఆ ఆరుగురు మహిళలు ఎవరనేది కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.

 

Exit mobile version