Prime9

Nirmala Sitharaman: తాంత్రికుడి మాటలు వినే కేసిఆర్ ఆ పని చేసింది.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

New Delhi: సీఎం కేసిఆర్ తాంత్రికుడి మాటలు విని నాలుగేళ్లు మహిళలను మంత్రి వర్గంలోకి తీసుకోలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఆరోపించారు. 2014 నుండి 2018 వరకు ఆయన మంత్రివర్గంలో మహిళలు లేరంటూ గుర్తుచేశారు.

టీఆర్ఎస్ శ్రేణులు భాజపాపై విరుచుక పడుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఆ పార్టీ తీరును ఢిల్లీలో ఎండగట్టారు. తెలంగాణ సెంటిమెంటుతో ఆవిర్భవించిన తెరాస, నేడు 3లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని ఆమె విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 నినాదాలతో టీఆర్ఎస్ ముందుకెళ్లిందన్నారు. మంత్రాలు, తంత్రాలు నెపంతో కేసిఆర్ సచివాలయానికి వెళ్లలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ఈసారి చెంచల్ గూడ లేదా తీహార్ జైల్లో కవిత బతుకమ్మ ఆడతారు.. కోమటిరెడ్డి

Exit mobile version
Skip to toolbar