Strong waring: తెరాస పార్టీలో నుండి భాజపాలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అధికార పార్టీ నేతల నోర్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నేడు ఢిల్లీ భాజపా పెద్దల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరిన వెంటనే తెరాస నేతలను టార్గెట్ చేస్తూ విమర్శించారు.
సీఎం కేసిఆర్ పార్టీలో ఆత్మ గౌరవం లేదన్నారు. ఆయన్ను కలవాలంటే పదవిలోనే ఉండాలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసమే భాజపాలో చేరానన్నారు. నేను చాలా సౌమ్యుడినని, దయచేసి ఎవ్వరూ నన్ను గెలకొద్దన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రలు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో పాటు పలువురు నేతల తీరును ఆయన తప్పుబట్టారు. కోట్లకు అధిపతి మల్లారెడ్డి చిల్లర పనులు మానుకోవాలని బూర సూచించారు. అలనాటి నటి సిల్క్ స్మిత లాగా రోడ్లపై చిందులేంటని ప్రశ్నించారు. రేపటి నుండి తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని వ్యాఖ్యానించారు.
బూర నర్సయ్య గౌడ్ ది వైద్యవృత్తి. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆ వైపు చూపులు సారించారు. అనంతరం తెరాస పార్టీలో చేరారు. 2014లో భువనగిరి పార్లమెంటు ఎంపీగా ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి ఆయనకు, తెరాసకు మద్య దూరం ఏర్పడింది. ఈ క్రమంలోనే భాజపా బూర నర్సయ్య గౌడ్ ను చాకచక్యంగా తన పార్టీలోకి చేర్చుకొన్నారు. ఇంకనూ, పలువురు తెరాస అసమ్మతి నేతలు భాజపా లోకి చేరేందుకు రెడీ ఉన్నారు.
ఇది కూడా చదవండి: కేసిఆర్.. దమ్ముంటే పార్టీలో చేర్చుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు..