Site icon Prime9

Telangana Congress: తగ్గేదేలే, భారత జోడో యాత్రలో రాహుల్ కు తోడుగా లక్ష మంది ప్రజలతో పాదయాత్రకు సిద్దమౌతున్న తెలంగాణ కాంగ్రెస్

TPCC is getting ready for Bharat Jodo Yatra with lakh of people

TPCC is getting ready for Bharat Jodo Yatra with lakh of people

Hyderabad: ఓవైపు మునుగోడు ఉప ఎన్నికలు. మరో వైపు భారత జోడో యాత్ర. ఈ రెండింటి నడుమ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ పాదయాత్రను మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీకి విజయం చేకూర్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 24న తెలంగాణలో భారత జోడో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటి ఛైర్మన్ మహేశ్వర రెడ్డి రాహుల్ గాంధీ పాదయాత్ర పై వివరణ ఇచ్చారు. జోడో యాత్ర నిర్వహణ కమిటి సమావేశాన్ని మాణిక్యం ఠాగూర్ ఆధర్వంలో రాహుల్ పాదయాత్ర ఏర్పాట్లు పై చర్చించారు.

దేశాన్ని సుస్ధిరంగా ఉంచడంతోపాటు భాజపా వ్యతిరేక విధానాలతో చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారన్నారు. దేశ చరిత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర మరిచిపోలేని యాత్రగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. 375కి.మీ మేర తెలంగాణా సాగనున్న పాదయాత్ర, ప్రసిద్ధిగాంచిన చార్మినార్ ప్రాంతం నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలందరూ పాదయాత్ర సాగే ప్రాంతాల్లో ఆయన్ను కలుసుకొనే విధంగా ప్రణాళికలు చేపట్టామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర విజయానికి తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ఉత్సాహాంగా పేర్కొన్నారు. తగ్గేదేలేదన్నట్లుగా తెలంగాణాలో సాగే రాహుల్ పాదయాత్రలో దాదాపుగా లక్ష మంది ప్రజలు ప్రతి రోజు ఆయన పాదయాత్రలో పాల్గొనేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకొంటుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికలపై రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రభావం ఖచ్ఛితంగా చూపనుంది. ఇప్పటికే అధికార పార్టీ తీరును భాజపా, టిపీసీసీ శ్రేణులు ఎండగడుతున్నారు. ఎటొచ్చి భాజపా నియంతృత్వ ధోరణితో మత విధ్వేషాలను ప్రజల్లో రెచ్చగొడుతుందని పదే పదే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే పాదయాత్ర సాగే రోజుల్లోనే ఉప ఎన్నికలు తెలంగాణాలో జరగనున్నాయి. మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కూడా పాదయాత్ర సాగుతున్న నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నడంతో కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి విజయావకాశలపై లెక్కలు వేసుకొంటున్నారు.

ఇది కూడా చదవండి:Revanth Reddy: బ్యాలట్ పేపరు ముద్రణలో సీఈసీ విఫలం.. ఆరోపించిన రేవంత్ రెడ్డి

Exit mobile version