Site icon Prime9

TDP Pattabhi Ram: సీఎం జగన్ బినామీ కంపెనీలకు వేల ఎకరాల భూమి ధారాదత్తం.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్

Thousands of acres of land were given to CM Jagan's benami companies... TDP spokes person Pattabhiram

Thousands of acres of land were given to CM Jagan's benami companies... TDP spokes person Pattabhiram

Andhra Pradesh: పంపుడు స్టోరేజి ప్లాంట్స్ (పిఎస్పీ) స్కీం కింద కడపకు చెందిన సీఎం జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కు వందల ఎకరాల భూమి ధారదత్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రుజువులతో మీడియాకు చూపించారు. వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వెయ్యి మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి 1200 ఎకరాల భూమిని కట్టబెట్టిన్నట్లు సీఎం పేర్కొన్న ప్రెజంటేషేన్ లో ఉందన్నారు.

అరబిందో రియాల్టీ, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు నంద్యాల దగ్గర 350, అనంతపురం 650, మరో 1500 ఎకరాల కూడా పంపుడు స్టోరేజి ప్లాంట్స్ స్కీం కింద మంజూరు చేయడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో జగన్ బినామీ కంపెనీలు తప్పితే ఇతర కంపెనీలు లేవా లేదా గుర్తుకు రావడం లేదా అని పట్టాభి ప్రశ్నించారు.

బినామీ కంపెనీలు కడపలో చక్రం తిప్పుతున్నాయని చెప్పుకొంటున్నందుకు సిగ్గుగా ఉందన్నారు. రాష్ట్ర సంపదను దోచిపెట్టేందుకు సీఎం జగన్ తన బినామీ కంపెనీలకు వేల ఎకరాలను ధారాదత్తం చేస్తున్నారని పట్టాభి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Minister KTR: ప్రధాని మోదీకి కేటిఆర్ బహిరంగ లేఖ

Exit mobile version