Site icon Prime9

Munugode By Poll: మునుగోడు పై మారిన కాంగ్రెస్ వ్యూహం

ts-congress-munugode

Telangana Congress: మునుగోడులో కొద్ది రోజులుగా స్థబ్దతుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. నేతలంతా ఒక భావోద్వేగ పూరిత వాతావరణంతో ఒక్కతాటి పైకి వస్తున్నారు. అగ్రనేత రాహుల్‌గాంధీని స్ఫూర్తిగా తీసుకుని మునుగోడు సిట్టింగ్ స్థానం పై కాంగ్రెస్ జెండా ఎగురేయలని ఎప్పుడు లేని విధంగా ఒక కసిగా జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా నేతలంతా సమన్వయంతో కదులుతున్నారు.

అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కన్యాకుమారి వెళ్లారు. యాత్ర ప్రారంభ రోజు రాహుల్ గాంధీ ఉద్వేగ ప్రసంగంతో వారికి కళ్ళు చెమర్చాయట. రెండు రోజుల పాటు జోడోయాత్ర లో పాల్గొన్న నేతలు అగ్రనేత లాంటి వారు ఒంటరిగా పోరాడుతుండగా లేనిది మనం ఎందుకు చేయకూడదన్న ఆలోచనలో పడ్డారట. ఆరోజు రాత్రి హోటల్ లో సీనియర్ నేతలంతా కూర్చుని రాహుల్ గాంధీ జోడోయాత్ర ని ఆదర్శంగా తీసుకొని మునుగోడు పై కాంగ్రెస్ జెండా ఎగురేద్దమని ప్రతినబూనారట.ఆ రెండు రోజులు అక్కడ ఉన్న నేతల్లో చాలా మార్పు వచ్చిందట, రెండు రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చిన నేతలకు రాహుల్ గాంధీ జోడోయాత్ర కంటి మీద కునుకు లేకుండా చేస్తూ. ఆయన చేస్తున్న ఒంటరి పోరాటం కళ్ళలో నుండి నీళ్లు తెప్పిస్తున్నాయట, దీంతో ఇక నుండి అందరం కలిసి సమన్వయంతో పని చేయాలని నేతలు చర్చించుకున్నారట.

జోడోయాత్ర ప్రారంభమైన రెండో రోజు నాడే కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థినిగా పాల్వాయి స్రవంతి పేరు ప్రకటన వెలువడింది.. అయితే అప్పటిదాకా కాంగ్రెస్ లో అభ్యర్థి ప్రకటన తరువాత మరో సంక్షోభం రాబోతుందని అందరూ అనుకున్నా, వాటిని పటాపంచలు చేస్తూ ఆశావహులతో పీసీసీ మాట్లాడుతూ పార్టీలో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో అందరం కలిసి పని చేస్తామని వారు సైతం తెలపడంతో మునుగోడు క్యాడర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తుందట. మరోవైపు పాల్వాయి స్రవంతి సైతం అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారు. అభ్యర్థి ప్రకటన వెలువడిన తరువాత ఆమె ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, విహెచ్, మధుయాష్కీ లాంటి నేతలను కలిశారు. వారంతా ప్రచారంలో తాము పాల్గొంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు మునుగోడులో కాంగ్రెస్ భారీ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసింది. పార్టీలో ఉన్న కీలక నేతలకు మండల ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించి, సహా ఇన్‌చార్జులను సైతం నియమించింది. మునుగోడు లో నాంపల్లి మండలానికి ఇన్‌చార్జ్‌గా దామోదర్ రాజనర్సింహ, కో ఇన్‌చార్జులుగా మాజీ ఎంపీలు అంజన్, మల్లు రవి, చౌటుప్పల్ కు ఇన్‌చార్జ్‌గా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో ఇన్‌చార్జ్‌గా కుంభం అనిల్, నాయిని రాజేంద్ర రెడ్డి, మునుగోడుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , సహాయకురాలిగా సీతక్కలను నియమించారు.అలాగే మర్రిగూడ కు ఇన్‌చార్జ్‌గా శ్రీధర్ బాబు, సహా ఇన్‌చార్జ్‌గా వేం నరేందర్ రెడ్డి , చెరుకు సుధాకర్, చండూర్ మండలానికి షబ్బీర్ అలీ, సహా ఇన్‌చార్జులుగా అనిల్, వంశీ కృష్ణ, గట్టుప్పల్ కు ఇన్‌చార్జ్‌గా వి.హనుమంత రావు ఆయనకు సహాయకులుగా ఏఐసీసీ సంపత్ ,అది శ్రీనివాస్‌లు బాధ్యతలు అప్పగించారు.ఇక నారాయణ పూర్ కు ఇన్‌చార్జ్‌తా రేవంత్ రెడ్డి , కో ఇన్‌చార్జులుగా బలరాం నాయక్ గండ్ర సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. ప్రచార కార్యక్రమాల్లో మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , జానారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ముందుండేలా ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 18 నుండి మునుగోడు లోని గడపగడపకు కాంగ్రెస్ నేతలు వెళ్లి అక్కడ ప్రచారం చేయనున్నారు. ఈ నేతలంతా ఎన్నిక పూర్తయ్య వరకు అక్కడే మకాం వేసేలా సమన్వయం చేశారు. మొత్తమ్మీద టిఆర్ఎస్, బిజెపి దూకుడుకు కళ్లెం వేసేలా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది

రాహుల్ గాంధీ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకున్న నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి మునుగోడును కైవసం చేసుకోవాలన్న నేతల ఆలోచన కేడర్లో జోష్ నింపుతోంది. మరి రాహుల్ గాంధీ స్ఫూర్తి ఈ నేతల్లో ఎంతవరకు ఉంటుందో చూడాలి.

Exit mobile version