Site icon Prime9

Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసు.. విచారణకు హాజరైన సునీల్ కనుగొలు

sunil kanugolu

sunil kanugolu

Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు.. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలు హాజరయ్యారు. నేడు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ కవితలపై సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు

గత నెల డిసెంబర్ 27న విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు 41A ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఈ విచారణకు అనారోగ్య సమస్యలతో హాజరు కాలేనని సునీల్ కనుగోలు హై కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు 41A నోటీసులు పై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. విచారణకు సహకరించాల్సిందిగా  సునీల్ కనుగోలు (Sunil Kanugolu) కు హై కోర్టు సూచించింది. ఈ కేసులో భాగంగా సునీల్ కనుగోలు అరెస్ట్ చేయవద్దని.. కేవలం విచారణ మాత్రమే చేయాలని కోర్టు సూచించింది. దీంతో ఆయన సోమవారం సైబర్ క్రైం పోలీసులు ఎదుట హాజరయ్యారు. హై కోర్టు ఇచ్చిన సూచనలతోనే సునీల్ కనుగోలును విచారిస్తున్నామని.. సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

విచారణలో ఏం తేలనుంది?

కాంగ్రెస్ వార్ రూమ్ వేదికగా.. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలపై అభ్యంతకర పోస్టుల్లో సునీల్ పాత్ర ఉందంటు సైబర్ క్రైం పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్

Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..

KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar