Site icon Prime9

Simhayaji: స్కూల్ టీచర్ నుంచి స్వామీజీగా మారి ఎమ్మెల్యేల కొనుగోలులో నిందితుడిగా.. ’సింహయాజి‘

Sinhayaji

Sinhayaji

Hyderabad: మునుగోడు ఉపఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారంటూ తెలంగాణ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ ఆదేశాలతో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాషాయ కండువా కప్పుకొనేలా ప్రయత్నిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే, పట్టుబడ్డ ముగ్గురు నిందితుల్లో సింహయాజి ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందినవారు.

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం రామనాథపురం గ్రామానికి చెందిన సింహయాజి అసలు పేరు అశోక్. ఈయన, 20 సంవత్సరాల క్రితం సొంత ఊర్లోనేప్రైవేటు స్కూలు నడిపేవారు. అందులో నష్టాలు రావడంతో దానిని మూసేసి మరో ప్రైవేటు స్కూలులో టీచర్ గా పని చేశారు. 10 ఏళ్ల తర్వాత స్వామీజీ అవతారం ఎత్తిరామనాథపురంలో శ్రీమంత్ర రాజపీఠం ఏర్పాటు చేశారు. దానికి తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. గత 15 ఏళ్లుగా తిరుపతిలోని ఓ పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు రామనాథపురానికి వచ్చి వెడుతుంటారని తెలుస్తోంది.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలులో నిందితులంటూ పోలీసులు అరెస్టు చేసిన వారితో తమకు ఏమీ సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామా అని తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి పన్నిన కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar