Site icon Prime9

YS Sharmila: కేసిఆర్ ప్రభుత్వం పై కాగ్ కు ఫిర్యాదు చేసిన షర్మిల

ys-sharmila

ys-sharmila

New Delhi: కేసిఆర్ ప్రభుత్వ పాలన పై ఘాటుగా విమర్శిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరో అడుగు ముందుకేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చోటుచేసుకొనిందని కాగ్ కు ఫిర్యాదు చేశారు.

తెలంగాణాలో ఉప ఎన్నికల క్రమంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు అవినీతి చక్రవర్తిగా కేసిఆర్ ను వర్ణిస్తున్నాయి. ఈ దశలో షర్మిల కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గిరీష్ ముర్ము ను కలుసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకొనిందని, నిర్మాణ క్రమాన్ని దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆమె కాగ్ ను కోరారు. తొలుత నిర్ణయించిన ప్రాజక్ట్ అంచనాలను మార్పు చేస్తూ లక్షా 20 వేల కోట్లకు ప్రాజక్ట్ వ్యయాన్ని పెంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను షర్మిల్ కాగ్ అధికారులకు అందించారు.

2023లో తెలంగాణలో అధికార పీఠాన్ని కైవశం చేసుకొనేందుకు కేంద్ర భాజపా ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆలోచనలతో ముందుకు పోతూ ప్రజల మద్య ఉనికిని చాటుకొనేందుకు భాజపా విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఏపీలోని జగన్ ప్రభుత్వం పై అక్కడి స్థానిక భాజపా నేతలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. కాని లోపాయికారికంగా కేంద్ర భాజపా పెద్దలు జగన్ కు సపోర్టు చేస్తున్నారు. దాని ఉద్ధేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెదేపాకు వచ్చే ఎన్నికల్లో విజయానికి వీలులేకుండా ఆ స్థానాన్ని భాజపా భర్తీ చేసేందుకు నానా తంటాలు పడుతుంది.

అదే క్రమంలో తెలంగాణలో అధికార పార్టీ తెరాసతో గట్టిగా పోరాడుతన్నట్లు నటిస్తూ ఇక్కడి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను గల్లంతు చేసేందుకే భాజపా ఎత్తులు వేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై స్థానిక భాజపా నేతలు విమర్శలు చేశారే గాని, ఎక్కడా గాని ఢిల్లీలోని సంబంధిత వ్యవస్ధలకు సరైన ఆధారాలు చూపించలేకపోయారు.

అయితే ఏపీలోని జగన్ చెల్లెలు షర్మిలను తెలంగాణాలో పార్టీ స్థాపించేలా భాజపా లోపాయికారి నాటకానికి తెర తీసింది. దీంతో షర్మిల తెలంగాణ అభివృద్ధి పేరుతో పాదయాత్రను చేపట్టింది. ఒక దశలో తెరాస నేతల పై విమర్శలు తీవ్రం చేయడంతో తెరాస-షర్మిల మద్య మాటల తూటాలుగా పేలాయి. ఈ క్రమంలోనే షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకొనిందని ఆరోపిస్తూ కాగ్ ను ఆశ్రయించింది. దక్షిణాధిన అన్ని రాష్ట్రాల్లో భాజపా పాగా వేసేందుకు స్థానిక రాజకీయాలను బట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ అధికారంలోకి వచ్చేందుకు వేస్తున్న ఎత్తులను ప్రజలు నిశతంగా గమనిస్తున్నారు.

సమస్యలను పట్టించుకోని పాలకపక్షం, స్వార్థం కోసం అమ్ముడుపోయిన ప్రతిపక్షాలు ఉన్నన్ని రోజులు అభివృద్ధి జరగదు. ఎల్లవేళలా ప్రజలపక్షాన నిలబడేది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే అనేది షర్మిల వ్యూహంగా ముందుకు సాగుతున్నారు.

ఇది కూడా చదవండి: Telangana Congress: తగ్గేదేలే, భారత జోడో యాత్రలో రాహుల్ కు తోడుగా లక్ష మంది ప్రజలతో పాదయాత్రకు సిద్దమౌతున్న తెలంగాణ కాంగ్రెస్

Exit mobile version