Site icon Prime9

Professor Kodandaram: మునుగోడు ఉప ఎన్నికలు.. నిబంధనలు గాల్లో.. ప్రొఫసర్ కోదండరాం

Rules were not followed in by-elections...Professor Kondaram

Rules were not followed in by-elections...Professor Kondaram

Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల్లో అలజడి రేపుతుంది. ప్రధానంగా నగదు పంపిణీ, లోపాయికారి హామీలు, విచ్చల విడి మద్యం పంపిణీ అంశాలు మునుగోడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. అధికార దాహంతో ఒకరైతే, అధికారం కోసం మరొకరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

ఈ నేపధ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధినేత ప్రొఫసర్ కోదండరాం వినూత్నంగా తన నిరసనను తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో విచ్చల విడి మద్యం పారుతుందని, నగదు పంపిణీ చేస్తున్నారంటూ మౌన ప్రదర్శనకు దిగారు. ఎన్నికల నియమాల ఉల్లంఘన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుద్ధ భవన్ లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో తన మౌన ప్రదర్శన ప్రదర్శించారు. పారదర్శకంగా ఎన్నికల అమలుకు చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: MLA Seethakka: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్ట్ చర్య పనికిమాలినది…ఎమ్మెల్యే సీతక్క

Exit mobile version