Site icon Prime9

Vijayashanti: పాలన పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. కేసిఆర్ పై రాములమ్మ ఫైర్

Public money is being misused in the name of governance

Public money is being misused in the name of governance

Hyderabad: తెలంగాణ సీఎం కేసిఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలియదు. ఆరోగ్యం బాగలేదంటూ అక్కడే తిష్టవేసి పాలన పేరుతో ప్రజాధనాన్ని కేసిఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ బ్రాండ్, భాజపా నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.

సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ, పగటి కలలతో కాలక్షేపం చేస్తున్నట్టు అనిపిస్తోంది. తెరాసను భారాస పార్టీగా పేరు మార్చడంతోనే కేసిఆర్ అధికారంలోకి వచ్చేసిన్నట్లు ఫీలవుతున్నారని హేళన చేశారు. అప్పుడే తను ఢిల్లీ సుల్తాన్ అయిపోయినట్టు ఆయన చేష్టలు చూస్తుంటే తెలుస్తోందని విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణకే ఏమీ చెయ్యని ఈ పెద్దమనిషి ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా తీరిక లేకుండా రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారని ఫైర్ బ్రాండ్ ఆరోపించింది.

అసలు కేసీఆర్ ఢిల్లీ ఎందుకెళ్లారో ఎవరికీ తెలీదు సరికదా, ఒంట్లో బాగా లేదంటూ అక్కడే తిష్టవేసి, తెలంగాణ వ్యవహారాల పై ప్రేమ కారిపోతున్నట్టు సీఎస్, డీజీపీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్‌తో పాటు ఇంకొందరు ఉన్నతాధికారులను ఢిల్లీ రమ్మని కబురుపెట్టారు. కేసీఆర్ అంతగా కదల్లేని పరిస్థితుల్లో ఉంటే ఆస్పత్రిలో ఎందుకు చేరలేదు? ఒకవేళ రాష్ట్ర అధికారులతో మాట్లాడాలంటే లైవ్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి కూడా ఆదేశాలివ్వచ్చు గదా అని విజయశాంతి ప్రశ్నించింది.

ఎవడబ్బ సొమ్మని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తన కోసమే గాక, అధికారుల విమాన యాత్రలు, వసతి కోసం దుర్వినియోగం చెయ్యాలి అంటూ మండిపడింది. ఢిల్లీ మద్యం పాలసీ స్కాం తన పీకకి పట్టుకుంటుందనే భయం ఒకవైపు, మునుగోడు ఉప ఎన్నికలో బీఆరెస్ కు ఓటమి తప్పదని గుర్తించిన్నట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తున్నానన్న ఫీల్ కోసం ఈ నయా నిజాం కేసీఆర్ పడుతున్న ఈ పాట్లు, పోకడ చూసి ప్రజలు నవ్వుకుంటున్నరని విజయశాంతి అన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay: కేంద్ర పధకాల పై కేసిఆర్ ప్రచారం చేయడం లేదు

Exit mobile version