MLA Varaprasad: గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కార్యకర్తల్లో నిరసన సెగ, అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకు అసమ్మతి, నిరసన సెగలు, ఫిరాయింపు ఊహాగానాలతో రోజుకో రచ్చ నడుస్తుంది. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కార్యకర్తల్లో నిరసన సెగ తగిలింది. ఇప్పటికే జిల్లాలో ఆనం రామ్ నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, పార్టీ మారతారు అనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారాయి.
గూడూరు లోని పివిఆర్ ఫంక్షన్ హాల్లో వైసిపి గూడూరు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిపారు. సమావేశం పూర్తయ్యాక కార్యకర్తలకు భోజనం కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసారు. భోజనం కోసం అడిగితే ఎమ్మెల్యే పోలీసుల చేత కొట్టిస్తున్నాడంటూ కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేశారు.
సచివాలయాల కన్వీనర్ల ఎంపిక, ఇతర విషయాల్లో కార్యకర్తలకు అన్యాయం చేశారని ఇప్పటికే వరప్రసాద్ పై భారీగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు – సమీక్ష సమావేశానికి పిలిచి భోజనాలు ఏవి అంటే పోలీసులతో కొట్టిస్తారా అంటూ ఎమ్మెల్యే పై మండిపడుతున్నారు కార్యకర్తలు.
కార్యకర్తలతో వాగ్వాదానికి దిగి కొట్టబోయారు ఎమ్మెల్యే వరప్రసాదరావు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యేకి సర్ది చెప్పి అక్కడ నుంచి పంపేశారు. ఈ సంఘటనతో నెల్లూరు జిల్లాలో వైసిపి వర్గ పోరు మరొకసారి బట్టబయలైనట్టు అయింది. సంయమనం పాటించి కార్యకర్తలకు సర్ది చెప్పాల్సింది పోయి కొట్టబోవడం ఏంటి అని ఎమ్మెల్యే వరప్రసాదరావుపై ఆ పార్టీ స్థానిక నేతల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/