Site icon Prime9

Nitish Kumar: ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం రహస్యంగా పనిచేస్తున్నాడు.. నితీష్ కుమార్

Nitish-Kumar-comments-on-pk

Bihar: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించారు. పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ చేసే ప్రకటనలకు అర్థం లేదని అన్నారు. అతను బీజేపీ కోసం రహస్యంగా పనిచేస్తున్నాడని విమర్శించారు.

బీహార్ లో ఆయన చేయాలనుకున్నది చేయనివ్వండి అని అన్నారు. 2005 నుంచి బీహార్ లో ఏం జరిగిందో ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. వారికి పబ్లిసిటీ ఎలా తీసుకోవాలో, స్టేట్మెంట్లు ఎలా ఇవ్వాలో తెలుసు, వారు అందులో నిష్ణాతులు అని అన్నారు. ఆయనకు బిజెపితో ఉండాలని మనసులో ఉన్నట్టుందనిచెప్పారు. ప్రశాంత్ కిషోర్ చేసే ప్రకటనలకు అర్థం లేదని అన్నారు.

ఆ వ్యక్తి ( పికె ) నాతో వచ్చాడు మరియు నేను ఈ పనిని మానేసి నాతో రమ్మని చెప్పాను. కానీ అతను నా మాట వినలేదు మరియు దేశవ్యాప్తంగా చాలా పార్టీల కోసం పని చేస్తూనే ఉన్నాడు. అది అతని వ్యాపారం (దందా) అని నితీష్ కుమార్ అన్నారు.

 

Exit mobile version