పవన్ కళ్యాణ్: నేను ఒక కులానికి పరిమితమయ్యేవాడిని కాదు.. కానీ కాపులు ఎదగడం లేదు..?

వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో కౌలురైతులను ఆదుకునేందురు కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ. లక్ష చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సభావేదికపై ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

నేను ఒక కులానికి పరిమితమైయ్యే వ్యక్తిని కాదు.. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తానని.. అన్ని కులాలను ఎంత గౌరవమిస్తానో నా కులానికి అంతే గౌరవమిస్తా అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నేనేదైన మాట్లాడితే నేను పుట్టిన కులం నుంచి వచ్చిన కాపు నాయకులతో తిట్టిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని కొందురు నాయకులు ఎదుగుతున్నారని కానీ కాపులు ఎదగడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాకు స్పూర్తిదాయకం గుర్రం జాషువా.. జాషువాను గుండెల్లో పెట్టుకుని అంబేద్కర్ ఆశయాల్ని అర్థం చేసుకున్నవాడిని బతుకున్నవాడిని. అలాంటి నన్ను నువ్వు ఎలా తిరుగుతావో చూస్తా అంటూ కొందరు వైసీపీ గాడిదలు నన్ను పచ్చి బూతులు తిడుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మండిపట్టారు.