Pawan kalyan: ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘‘మా తాత, మా నాన్న ముఖ్యమంత్రులు కాదు’’ అని పవన్ అన్నారు.
తాను ముఖ్యమంత్రి కావాలని కలలు కనడం లేదని అన్నారు. ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే.. రాజకీయ స్థిరత్వం ఉండాలని అన్నారు. తమను ప్రజలు అధికారంలో తీసుకొస్తే.. తాను కూలీ మాదిరిగా పనిచేస్తానని చెప్పారు.
‘‘మంత్రి ఇల్లు తగులబడిన సీఎం వెళ్లలేదు.. ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు.
అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకి అప్పగించమనడమేంటి ? కోడి కత్తితో గీకించుకుని ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడమేటి ?
ఏపీ డాక్టర్ల మీద నమ్మకం ఉండదు.. హైదరాబాద్ వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు.
అధికారంలోకి వచ్చాక ఆ డాక్టర్‌ను ఆరోగ్య శ్రీ పథకంలో చైర్మన్ చేస్తారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్నారు.. వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తాం.
పోలీసులు రోజు సెల్యూట్ చేసే ముఖ్యమంత్రికి.. వాళ్లంటే గౌరవం లేదు.
టీనేజ్ లో ఉన్నప్పుడు జగన్ చేసిందేంటో తెలుసా..
ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు పులివెందులలో ఒక పోలీసు అధికారిని జైలులో పెట్టి కొట్టిన ఘనత ఉంది.
ఈరోజు అతని చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది’’ సీఎం జగన్ టార్గెట్‌గా పవన్(Pawan kalyan) విమర్శల వర్షం కురిపించారు.
సెక్యూలరిజమ్ పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టద్దని అన్నారు. హిందూ దేవతలను దూషణ చేయవద్దని కోరారు.
ఈ మధ్య కాలంలో దూషణలు ఎక్కువ అయిపోతున్నాయి.. అలాంటి వ్యాఖ్యలు చేసేవారు మానుకోవాలని కోరారు.
మహ్మద్ ప్రవక్తను, జీసెస్‌ను అనడానికి భయమేస్తుందని.. కానీ హిందూ దేవతలను వారికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందని ప్రశ్నించారు.
ఇది మాట్లాడినంతా మాత్రానా తాను రైట్ వింగ్ అయిపోనని అన్నారు. సెక్యూలరిజమ్ అని చెప్పి నోటికొచ్చినట్టుగా మాట్లాడటం తప్పని అన్నారు.
ఇప్పటికే ప్రజల సొమ్ముకోట్లాది రూపాయలు దోచేశారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఎస్సీ,
ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా దోచుకున్నారని అరోపించారు. విజభన రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారంలో ఉన్నారు కదాని ఇష్టానురీతిగా వ్యవహరించినా..విభజన రాజకీయాలు చేసినా తోలుతీస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికే మూడు రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్ లో గందరగోళం సృష్టించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా వేర్పాటువాద రాజకీయాలు మానుకోవాని సూచించారు.
రాయలసీమ ప్రజలు బతకలేక వలసలు వెళ్లిపోతుంటే ఆ ప్రాంతంనుంచే నేతలుగా సీఎంలుగా అయినవారు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్ ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/