Janasena Yuvashakthi: భవిష్యత్తు ఎన్నికల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. ఈ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అదే విధంగా జనసైనికులకు రాబోయే ఎన్నికల గురించి దిశానిర్దేశం చేశారు.
పొత్తులుపై క్లారిటీ ఇచ్చిన పవన్..
వైసీపీని గద్దె దించేందుకు వచ్చే ఎన్నిల్లో ఒంటరిగా వెళ్లడానికి నేను సిద్ధం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరు క్షేత్రస్థాయిలో బలం కలిగిస్తే నేను ఒంటరిగానే వెళ్తాను అని పార్టీ శ్రేణులు ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఆయన.. కుదిరితే పొత్తులు లేదంటే ఒంటరిగానే పోటీ అన్నారు. గౌరవప్రదంగా ఉండేలా పొత్తులు జరిగితే ఒకే అని మన గౌరవాన్ని తగ్గించేలా ఉంటే మాత్రం సింగిల్ గా బరిలోకి దిగుదాం అని స్పష్టం చేశారు. కానీ, వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారు.
గత ఎన్నికల్లో నా సభలకు జనం తరలివచ్చారు.. కానీ ఓట్లేసే సమయానికి నన్ను వదిలేశారు. చట్టసభల్లో ఎదిరించి నిలబడేందుకు అవసరమైన సత్తా ఇవ్వలేకపోయారు. రెండు చోట్ల ఓడిపోయావు అని కించపరుస్తూ ఉంటే దాన్ని యుద్ధం తాలూకు గాయంగానే భావించాను. అంతేతప్ప, నేనేం బాధపడలేదు.. అవమానంగా భావించలేదు. ఆశయం ఉన్నవాడికి ముందడుగే ఉంటుందని నమ్మేవాడ్ని. ఈ రణస్థలంలో మాట ఇస్తున్నా.. తుదిశ్వాస విడిచే వరకు రాజకీయాలను వదిలివెళ్లను, ప్రజల వెన్నంటే ఉంటాను. దీన్ని నా మూడో తీర్మానంగా తీసుకోండి” అని ఉద్ఘాటించారు.
ఇవాళ ప్రతి సన్నాసి చేత, ప్రతి వెధవ చేత మాటలు అనిపించుకుంటుంటే నాకేమీ బాధగా లేదు. ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులతో మాట అనిపించుకోకుండా బతికేయగలను.. నా చేతుల్లో ఆ జీవితం ఉంది. రాజకీయాల్లోకి రాకపోతే ఇలాంటి సన్నాసులు నా పక్కన నిలబడి ఫొటోలు కూడా తీయించుకుంటారు. నాకు తిట్టించుకోవడం ఓకే.. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు తిట్టించుకోవడం నాకేమీ బాధ కలిగించదు. మన కోసం మనం జీవించే జీవితం కంటే కూడా సాటి మనిషి కోసం జీవించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో కష్టాలు రెండున్నర గంటల్లో తీర్చగలను, కానీ నిజజీవితంలో ఉద్దానం వంటి కష్టాన్ని ఈ రోజుకీ తీర్చలేను. ఇవన్నీ చూసి, విభజన సమయంలో పరిస్థితులు చూసి రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇవీ చదవండి:
నన్ను చంపేస్తారు.. సుపారీ కూడా ఇచ్చారు- పవన్ కళ్యాణ్
ఛీఛీ నా బతుకుచెడా.. మీకోసం డైమండ్ రాణి రోజా విమర్శలు కూడా పడుతున్నా- పవన్ కళ్యాణ్
బిడ్డ చనిపోయాడు న్యాయం చేయమంటే మూడు బస్తాల బియ్యం ఇస్తానంటావా? నువ్వేం మంత్రివి? మంత్రి ధర్మానపై పవన్ కళ్యాణ్ ఫైర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/