Site icon Prime9

AP ministers :ఏపీ మంత్రులకు నవంబర్‌ గండం

apcm rythu bharosa second phase money released

apcm rythu bharosa second phase money released

AP ministers:  ఏపీ మంత్రులకు నవంబర్‌ ఫీవర్‌ పట్టుకుందా? ఆ విషయంలో ఏపీ మంత్రులు భయపడుతున్నారా? సీఎం జగన్‌ చేసిన హెచ్చరికలు దేనికి సంకేతం? నవంబర్‌లో ఏపీ సర్కార్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందా?

వైసీపీలో ఎన్నికల వాతావరణాన్ని సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే సీఎం జగన్ తీసుకువచ్చారు. ఆరు నెలల క్రితం నుంచి ఆయన ఎమ్మెల్యేలను జనంలోకి పంపిస్తున్నారు. అలాగే వారి పనితీరు మీద సమీక్ష కూడా చేస్తున్నారు. పనితీరే ప్రమాణం అని జగన్ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే తాను కూడా ఏమీ చేయలేనని అంటున్నారు జగన్‌ ఎవరి కోసమో నియోజకవర్గాన్ని తాను వదులదలచుకోలేదని జగన్‌ కుండబద్ధలు కొట్టేశారు. ఇటీవల జరిగిన పార్టీ నేతల వర్క్ షాప్ లో కొందరు మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. చాలా మంది మంత్రులకు జిల్లా ఇంచార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే వారు ఆ విషయంలో కూడా అనుకున్నట్లుగా పనిచేయడం లేదు అని అంటున్నారు.

జిల్లా ఇంచార్జి అంటే అటు ఎమ్మెల్యేలను ఇటు పార్టీని కలుపుకుని పోవాల్సి ఉంటుంది. అలాగే పార్టీని ప్రభుత్వాన్ని కూడా కో ఆర్డినేట్ చేసుకోవాలి. టోటల్ గా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా జిల్లా ప్రెసిడెంట్లతో కలసి సరిదిద్ది అవి ముదరకుండా చక్కబెట్టాలి. కానీ చాలా మంది ఇంచార్జి పదవులను కూడా అలంకారప్రాయంగా భావిస్తున్నారు అని అంటున్నారు.తమ మంత్రిత్వ శాఖలను చూసుకుంటూ తమకు అప్పగించిన జిల్లాలలో పార్టీ బాధ్యతలను కూడా చూడాలి. ఉత్తరాంధ్రా జిల్లాలలో ఒక కీలక జిల్లాకు ఇంచార్జిగా ఉన్న మంత్రి ఒకరి విషయంలో జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. దాంతో పనితీరు మెరుగుపరచుకోవాలని కోరినట్లుగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే మంత్రులు కొందరు శాఖాపరంగా మెరుగైన ఫలితాలను సాధించడంలేదని కూడా జగన్ భావిస్తున్నట్లుగా అంటున్నారు. వారికి మంత్రి వర్గ సమావేశంలో కూడా ఒక విధంగా హెచ్చరిక చేశారని అంటున్నారు. అయినా మంత్రులు ఇంకా అక్కడే ఉన్నారన్న భావన వైసీపీ హై కమాండ్ లో ఉంది అని అంటున్నారు పరిశీలకులు. దాంతో జగన్ వారికి కూడా చురకలు అంటించారని అంటున్నారు.

నవంబర్లో మరో సారి వర్క్ షాప్ ఉంటుందని అదే వర్క్‌షాప్‌లో జగన్‌ ప్రకటించారు. ఇక నవంబర్ లో మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఈసారి వర్క్ షాప్ లో చేసిన హెచ్చరికలే పవర్ ఫుల్ అని అంటున్నారు. ఈ లాస్ట్ వార్నింగ్ ని కనుక పట్టించుకుని ఎవరైనా మెరుగుపడకపోతే మాత్రం ఇక వారి పదవులకు ముప్పు వాటిల్లినట్లే అని భావిస్తున్నారు.మొత్తానికి చూస్తే మంత్రులలో కనీసం అరడజన్ మంది డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా టాక్‌ వినిపిస్తోంది. వారి విషయంలో మార్పు రావడానికి అక్టోబర్ నెల ఒక్కటి మాత్రమే వ్యవధి ఉంది. అది కూడా అధినాయకత్వం ఆశించిన స్థాయిలో మార్పు రాకపోతే కచ్చితంగా మాజీ మంత్రులు అవుతారని చెబుతున్నారు. దీంతో మంత్రులకు ఇపుడు నవంబర్ ఫీవర్ పట్టుకుందని సమాచారం.

Exit mobile version