Site icon Prime9

Nara lokesh: దేవుడి స్క్రిప్ట్‌.. జగన్ రెడ్డి భవిష్యత్తేంటో.. నారాలోకేష్

nara-lokesh

Andhra Pradesh: వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకొంటూ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో నిర్ణయం తీసుకున్న ఎన్నిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు.

కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను ట్వీట్‌తో పాటూ జత చేశారు. ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు. తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు. రెండూ ఒకే రోజు, దేవుడి స్క్రిప్ట్‌. జగన్ రెడ్డి భవిష్యత్తేంటో?’ అంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. యూనివర్శిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాతే, కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్షుడి అంశంలో ట్విస్ట్ ఇచ్చిందంటూ లోకేష్ పరోక్షంగా ప్రస్తావించారు. ట్వీట్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను జత చేశారు.

ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎన్నికల సంఘం ప్రస్తావించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి.

Exit mobile version