Nara Lokesh Padayatra : తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’పేరుతో ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టారు.
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 4000 వేల కిలో మీటర్లు నడవాలని పాదయాత్రను తలపెట్టారు. 400 రోజులు సాగే ఈ పాదయాత్రకు ఏపీ పోలీసులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు.
కానీ అనేక షరతులతో పెట్టి.. గీత దాటితే అనుమతి రద్దు చేస్తామని చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ తెలిపారు. 15 షరతులు, నిబంధనలతో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక వేళ శాంతిభద్రతలకు అడ్డంకులు కలిగినట్టు ఫిర్యాదులు వచ్చినా, నిబంధనల్లో ఓ ఒక్కటి పాటించకపోయినా.. పాదయాత్ర ను రద్దు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ నెల 27 న ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర 29 వరకూ కుప్పం నియోజక వర్గం వరకూ ఉండనుంది.
అయితే ఏపీ పోలీసులు ఇచ్చిన షరతులు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి 29 సాయంత్రం 5.55 గంటల వరకు.. అంటే మూడు రోజుల మాత్రమే ఉండనున్నాయి.
పోలీసులు ఇచ్చిన షరతులివే..
– పాదయాత్రను బహిరంగ సభగా మార్చకూడదు. పాదయాత్రలో భాగంగా ప్రజలతో జరిపే ఇంటరాక్షన్ సభగా మాదిరిగా ఉండకూడదు. రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్రజలతో మాట్లాడాలనుకున్నపుడు మైక్ వాడాలంటే స్థానిక డీఎస్పీ అనుమతి తీసుకోవాలి.
– మాటామంతి లాంటి కార్యక్రమాలను ఖాళీ ప్రదేశాల్లో నిర్వహించుకోవాలి. ఒక వేళ వాటిని రోడ్ షో ల మాదిరి నిర్వహించాలంటే మాత్రం అనుమతుల కోసం డీఎస్పీ కి దరఖాస్తు చేసుకోవాలి.
– జాతీయ , రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రహదారులపై బహిరంగ సభలు నిర్వహించకూడదు. అత్యవసర సేవలకు, నిత్యావసర సరుకుల రవాణాకు ఆటంకం కలిగించకూడదు.
-బహిరంగ సభ నిర్వహించాలంటే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసి, ఆ వివరాలు డీఎస్పీ అందించి అనుమతి తీసుకోవాలి.
– పాదయాత్రలో డీజే సిస్టమ్స్ , లౌడ్ స్పీకర్లను వాడకూడదు. సింగిల్ సౌండ్ బాక్స్ సిస్టమ్ ను తక్కువ సౌండ్ తో వాడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు.
– జనాన్ని నియంత్రించేందుకు పురుష, మహిళా వాలంటీర్లను నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలి. భద్రతో పాటు ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం వాలంటీర్ల బాధ్యతే.
వాలంటీర్లు అందరూ ఒకే రకం యూనిఫాం ధరించాలి.
– పాదయాత్ర రోడ్లన్నీ బ్లాక్ చేయకూడదు. సాధారణ రాకపోకలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదు.
– ప్లయింగ్ కెమెరాలు, డ్రోన్లతో ఫొటోలు తీయాలంటే డ్రోన్ నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.
-ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకూడదు. వాటి విధ్వంసం జరగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే.
-అనుమతించిన వాహనాలే పాదయాత్రలో ఉండాలి. అంతకంటే ఎక్కువ వాహనాలు ఉపయోగించకూడదు.
-పాదయాత్రలో పాల్గొనే వారు ప్రాణాంతక ఆయుధాలు, రాళ్లు వినియోగించకుండా చూడాలి.
పాదయాత్రలో టపాసులు వాడకం పూర్తిగా నిషేదం. మద్యం, మత్తు పదార్థాలు వినియోగించకూడదు.
యాత్రలో పాల్గొనే వారి వ్యక్తిగత భద్రత నిర్వాహకులే చూసుకోవాలి. అంబులెన్స్ లు, ప్రథమ చికిత్సలు లాంటివి నిర్వాహకులే చూసుకోవాలి.
రాత్రి బసచేసే ప్రదేశంలో అవసరమైన లైట్లు, బారిగేట్లు ఏర్పాటు చేసుకోవాలి.
షెడ్యూల్ లో పేర్కొన్న రూట్, టైం ను బట్టే పాదయాత్ర జరగాలి.
ఈ షరతులన్నింటికీ నిర్వాహకులు కట్టుబడి ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా దానికి పూర్తి బాధ్యత నిర్వాహకులదే అని పోలీసులు స్పష్టం చేశారు.
1861 పోలీస్ చట్టంలోని సెక్షన్ 30లోని ఒకటి, రెండు, మూడు, నాలుగు అంశాల కింద ఈ అనుమతి ఇస్తున్నట్లు అందులో తెలిపారు.
లోకేష్ పాదయాత్ర కోసం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పలుమార్లు అనుమతి కోరగా.. పలు షరుతులతో అనుమతి ఇస్తూ ఉత్వర్వులు జారీ చేశారు పోలీసులు.
ఆంక్షలపై టీడీపీ నేతలు ఫైర్
పోలీసులు లోకేష్ పాదయాత్రకు అనేక షరతులు విధించడంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. లోకేశ్ పాదయాత్రతో వైఎస్సార్సీపీకి భయం పట్టుకుందన్నారు.
అందుకే షరతుల పేరిట కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని చేసినా పాద యాత్ర నిరాటంకంగా సాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
కనీవిని ఎరుగని రీతిలో షరతులు పెట్టడం, 400 రోజుల పాదయాత్ర ప్రభత్వ అనుమతి కోరితే 3 రోజులకి ఇవ్వడంపై టీడీపీ మండిపడుతోంది.
గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసినపుడు.. అప్పటి టీడీపీ గవర్నమెంట్ పూర్తి పాదయాత్రకు ఒకేసారి అనుమతి ఇచ్చిందని గుర్తుచేసింది.
అప్పటి జగన్ పాదయాత్రకు మూడు షరతులు పెడిదే.. ఇప్పటి లోకేష్ పాదయాత్రకు ఇవేం షరతులని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో లేని రూల్స్.. ఇప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చాయా అన్నారు.
కడపలో ప్రత్యేక ప్రార్థనలు
కుప్పంలో 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో లోకేష్ మూడు ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేయనున్నారు.
ముందుగా బుధవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించి విమాన లో కడప చేరుకుంటారు.
అక్కడ ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను, ప్రసిధ్ద రోమన్ కేథలిక్ చర్చిన సందర్శిస్తారు. తర్వాత సాయంత్రం కడప నుంచి తిరుమల చేరుకుంటారు.
రాత్రి అక్కడే బస చేసి, గురువారం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం కుప్పం వెళ్తారు.
శుక్రవారం మధ్యాహ్నం వరద రాజుల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభ నిర్వహిస్తారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/