Munugodu By Elections: మునుగోడు నియోజవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబర్ 3న ఉపఎన్నికను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 6న ఓట్ల లెక్కంపును చేపప్టనున్నట్లు ఈసీ పేర్కొనింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఆ రోజు నుండి మునుగోడులో ఎన్నికల నిబంధనలు అమల్లోకి రానున్నాయి.నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 14వరకు, పరిశీలన 15న, ఉపసంహరణ 17లోపుగా ఈసీ నిర్ణయించింది.
ఇప్పటికే ప్రధాన పార్టీలు వారి వారి వ్యూహ రచనలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించివున్నారు. భాజపా మోటారు బైక్ ర్యాలీతో ఓటర్లను ఆకర్షించేందుకు యత్నాలు చేపట్టింది. అధికార టీఆర్ఎస్ సభలతో ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ ప్రణాళికలలు ఏర్పాటు చేసుకొంటున్నారు.
తక్కువేమీ కాదన్నట్లు కాంగ్రెస్ కూడా మునుగోడు ఎన్నికల తమ ఓటింగ్ శాతాన్ని పెంచుకొని సత్తా చూపించేందుకు రెడీ అయినారు. ఈనెలాఖరులో రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర తెలంగాణాలోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో ఆపార్టీకి రాహుల్ కొత్త మైలేజ్ ను కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి:Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు తప్పిన ప్రమాదం