Site icon Prime9

Mp Avinash Reddy: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

YS Avinash

YS Avinash

Mp Avinash Reddy: దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28 న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ఈనెల 24 న విచారణ

తాజాగా మరోసారి ఈనెల 24 వ తేదీ హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపారు.

తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా ధ్రువీకరించారు. అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులివ్వడం ఇదో రెండో సారి.

2019 మార్చిలో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి.. ఎంపీతో అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డిపై పలు విమర్శలు వచ్చాయి.

2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించారు.

వారి వాంగ్మూలాలను రికార్డు కూడా చేసింది సీబీఐ. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన వ్యక్తిగా అవినాష్‌రెడ్డిని విచారిస్తోంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

ఆరోపణలు ఎందుకంటే..

వివేకా నందా రెడ్డి దారుణ హత్యకు గురి కాగా, గుండెపోటుతో చనిపోయారని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా ప్రచారం జరిగినా మృతదేహం వద్ద రక్తపు మరకలు, సాక్ష్యాధారాలు చెరిపేస్తున్నా..

పులివెందుల సీఐ శంకరయ్యని శివశంకర్‌రెడ్డి బెదిరిస్తున్నా.. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డుకోలేదనే ఆరోపణలను అవినాష్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు.

2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ అవినాష్‌రెడ్డికి ఇచ్చారు. అయితే షర్మిల గానీ, విజయమ్మ గానీ లేదంటే తనకే ఇవ్వాలనేది వివేకా అనుకున్నారని తెలిసింది.

ఇది తెలిసే అవినాష్‌రెడ్డి కుటుంబం కుట్రకు పాల్పడి ఉంటుందనే అనుమానాలను సీబీఐ వ్యక్తం చేస్తోంది.

 

Exit mobile version
Skip to toolbar