Site icon Prime9

Rajagopal Reddy: 15 రోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని పడగొడతా- రాజగోపాల్ రెడ్డి

komatireddy rajgopal reddy shocking comments on kcr in election campaign at choutuppal

komatireddy rajgopal reddy shocking comments on kcr in election campaign at choutuppal

Rajagopal Reddy: మునుగోడు ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. నేటితో ఈ ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‭ను గద్దె దింపే వరకు తన పోరాటం ఆగదని, కేసీఆర్ను ఓడిస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి శపథం చేశారు. మునుగోడులో తాను గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 15 రోజుల్లో పడగొడతామని సంచలన కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మునుగోడు ప్రజలు రాష్ట్రంలో చరిత్ర సృష్టించే తీర్పు ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు తెరాస రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో తిష్ట వేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆయన ఆరోపించారు. పార్టీ మారానని నన్ను అంటున్నారు కాని గతంలో 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఉండకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం పేరుతో యదేఛ్చగా ఇసుక, ల్యాండ్, గ్రానైట్ మాఫియా జరిగిందని అందుకు సంబంధించిన నివేదికను అమిత్ షాకు అందజేశానని ఆయన తెలిపారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన అవినీతి‭పై సీబీఐ విచారణ జరిపించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా కొత్తగా చట్టం తీసుకురావడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు తాను దేనికైనా సిద్ధమని కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:భాజపా ర్యాలీ, తెరాస డీజే.. ఇంకేముంది అంతా రచ్చరచ్చే..!

Exit mobile version
Skip to toolbar