Site icon Prime9

Kanna Lakshminarayana: ఏపీలో పవన్‌ను, తెలంగాణలో బండి సంజయ్‌ను తొక్కేయాలని కుట్ర జరుగుతోంది

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana: తాను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎంతో మందిని పార్టీలోమ జాయిన్ చేసానని వారందరూ ఇపుడు పార్టీని ఎందుకు వీడుతున్నారో చెప్పాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు. కోర్ కమిటి లో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని ఆయన ఆరోపించారు. అధ్యక్షుల మార్పు తనతో చర్చించలేదన్నారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని కన్నా అన్నారు.

తన వియ్యంకుడు బీఆర్ఎస్ లో ఎందుకు చేరాడో సోము వీర్రాజు ను అడగాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపీ జివిఎల్ ఆలోచన స్థానిక బిజేపి కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందన్నారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవిఎల్ వైఖరి చూశామని కన్నా పేర్కొన్నారు. జగన్ – కేసిఆర్ కుట్రలో బాగంగానే బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు వెడుతున్నారని కన్నా తెలిపారు. ఏపిలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను బలహీనపరచడానికి కుట్రలు  జరుగుతున్నాయన్న కన్నా జగన్ , కేసిఆర్ లు కలసి ఈ కుట్ర చేస్తున్నారని అన్నారు.

జగన్‌ది పాలన కాదని.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రాజకీయ నేతను బతకనీయరని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని కాపు నేతలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని అన్నారు. పవన్‌కు తామంతా అండగా ఉంటామని చెప్పారు.

Exit mobile version