Site icon Prime9

Bharat Jodo Yatra: యేసు మాత్రమే నిజమైన దేవుడు.. రాహుల్ గాంధీతో పాస్టర్ సంభాషణ

poster-met-rahul-gandhi

New Delhi: కాంగ్రెస్ ‘భారత్ జోడో’ ప్రచారం రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి బిజేపీకి మరో అవకాశాన్ని ఇచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పాస్టర్ అయిన జార్జ్ పొన్నయ్య మరియు రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పాస్టర్ జీసస్‌ను ‘ఏకైక నిజమైన దేవుడు’ అని అభివర్ణించడం కనిపించింది.

ఏసుక్రీస్తు దేవుడి రూపమా లేక స్వతహాగా దేవుడా అని రాహుల్ గాంధీ పాస్టర్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పాస్టర్ ఇలా అంటాడు “ఇతర శక్తి లేదా శక్తుల మాదిరిగా కాకుండా మానవ రూపంలో ఉండే నిజమైన దేవుడు యేసు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు తన కుడి వైపున ఉన్న ఒక వ్యక్తి యేసు దేవుని కుమారుడని మరియు స్వయంగా దేవుడని పేర్కొంటూ సమాధానాలు ఇవ్వడం కనిపించింది.

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా భారత్ జోడో విత్ భారత్ టోడో ఐకాన్స్’ అంటూ కాంగ్రెస్‌ పై దాడి చేస్తూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీని కలిసిన జార్జ్ పొన్నయ్య “శక్తి ( ఇతర దేవుళ్ళు) కాకుండా యేసు మాత్రమే దేవుడు” ఈ వ్యక్తి హిందూ ద్వేషంతో ఇంతకు ముందు అరెస్టు చేయబడ్డాడు. భారత మాత యొక్క మలినాలు మనల్ని కలుషితం చేయకూడదు. కాబట్టి నేను బూట్లు ధరిస్తాను అని కూడ చెప్పాడు. భారత్ టోడో ఐకాన్స్ తో భారత్ జోడో  అంటూ షెహజాద్ పూనావాలా ట్వీట్ చేసారు.

 

Exit mobile version