Janasena Pawan Kalyan : విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కై సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని ఆయన చెప్పిన మాటకు వైసీపీ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపక్షం అయిన వైసీపీ అడుగడుగునా విమర్శలు, అమరావతి ఒక భ్రమరావతి, గ్రాఫిక్స్ మాయాజాలం తాత్కాలిక కట్టడాలు తప్పా అభివృద్ధి ఏమి లేదు అని విమర్శల నడుమ నిజంగానే చెప్పుకోదగ్గ ఐటీ కంపెనీల పెట్టుబడుల్ని ఆకర్షించలేకపోయింది అప్పటి టీడీపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేనప్పుడు, పెట్టుబడిదారులకు లోకల్ నాయకులు నుండి కమిషన్ల ఒత్తిడి, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారిపోయే పాలసీలు నడుమ ఏ పారిశ్రామికవేత్తా వేల కోట్లు వెచ్చించి పెట్టుబడి పెట్టె సాహసం చెయ్యరు.. రాష్ట్రం విడిపోయినప్పటి నుండి నేటికీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు పడకపోవడానికి ఇవే ప్రధాన కారణాలు.
ఇందుకు భిన్నాంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం సర్వత్రా ప్రశంసలను అందుకుంటుంది. జగన్ అంటే ద్వేషం, జగన్ చేసే మంచిని కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసించరు అని విమర్శించే వైసీపీ నోళ్ళకి తాళం పడింది. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమయినా ఇచ్చేవే.. వాటికి పనిగట్టుకుని ప్రశంసించాల్సిన అవసరం లేదు.. కానీ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు ప్రతిపక్షాల మద్దతు ఉండటం అవసరం.. రేపు ప్రభుత్వాలు మారినా తమని ఇబ్బంది పెట్టరు అనే భరోసా ఉంటేనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు.
4) JSP’s Advise to YCP Govt
Do not confine the summit’s thinking to Visakhapatnam alone; do tell the investors about the prospects in Tirupati, Amaravati,Anantapur, Kakinada,Srikakulam,Ongole etc. Make this truly an Investors Summit for entire State of AP, but not just a city.
— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2023
అభివృద్ధి అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించండి – పవన్ కళ్యాణ్ (Janasena Pawan Kalyan)
ఇంత గొప్ప ఆలోచన చేసి వైసీపీ ప్రయత్నానికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్.. దాంతో పాటు ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించామని. కేవలం వైజాగ్‌కే పరిమితం కాకుండా, తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించమని, పవన్ పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖపట్నం వేదికగా “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు. ఆ సమయంలో వేదికపై సీఎం జగన్, ముఖేష్ అంబానీతో పాటు, కరణ్ ఆదానీ, జీఎంఆర్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి అతిథులు విచ్చేశారు. వీరికి నోరూరించే వంటకాలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/